AP news: ప్రభుత్వ ఉత్తర్వులు ఆన్‌లైన్‌లో పెట్టొద్దు: ఏపీ

ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులను ఆన్‌లైన్‌లో పెట్టకూడదని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. జీవోలను ఆఫ్ లైన్లోనే పెట్టేలా చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల కార్యదర్శులు, ముఖ్య

Updated : 17 Aug 2021 11:01 IST

అమరావతి: ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులను ఆన్‌లైన్‌లో పెట్టకూడదని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. జీవోలను ఆఫ్ లైన్లోనే పెట్టేలా చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శలుకు సాధారణ పరిపాలనా శాఖ ఆదేశాలు జారీ చేసింది. పొరుగు రాష్ట్రాల్లో అమలవుతోన్న విధానాలను అనుసరిస్తూ ఆన్‌లైన్‌లో జీవోలను ఉంచడాన్ని నిలిపి వేయాలని  నిర్ణయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇటీవల బ్లాంక్‌ జీవోల జారీ వివాదాస్పదం కావడంతో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. 2008లో వైఎస్ హయాం నుంచి ఏపీ ప్రభుత్వం ప్రజల కోసం జీవోలను ఆన్‌లైన్‌లోఉంచుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని