కిమ్స్‌కు గుండె, ఊపిరితిత్తుల తరలింపు.. గ్రీన్ ఛానెల్ ఏర్పాటుతో నిలిచిన ప్రాణం

రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన ఓ వ్యక్తి అవయవాలను మరొకరికి అమర్చేందుకు హైదరాబాద్ పోలీసులు మరోసారి ట్రాఫిక్ గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశారు.

Updated : 13 Nov 2021 19:21 IST

హైదరాబాద్‌: రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన ఓ వ్యక్తి అవయవాలను మరొకరికి అమర్చేందుకు హైదరాబాద్ పోలీసులు మరోసారి ట్రాఫిక్ గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశారు. మలక్‌పేట యశోదా ఆస్పత్రి నుంచి గుండె, ఊపిరితిత్తులను సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. 11 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ మార్గంలో ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేయడంతో ఓ వ్యక్తి ప్రాణం నిలిచింది. అత్యవసర సమయాల్లో వ్యక్తి ప్రాణాలు కాపాడేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న కృషిని పలువురు కొనియాడారు. ఈ ఏడాది.. ఇప్పటివరకూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అవయవ రవాణాను సులభతరం చేసేందుకు 30 సార్లు గ్రీన్ ఛానెల్స్‌ ఏర్పాటు చేశారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని