Updated : 27 Apr 2022 15:51 IST

GRMB: ఏపీ అభ్యంతరాలను జీఆర్‌ఎంబీ ఛైర్మన్‌ తిరస్కరించారు: రజత్‌కుమార్‌

హైదరాబాద్: నగరంలోని జలసౌధలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) సమావేశం ముగిసింది. బోర్డు ఛైర్మన్‌ ఎంపీ సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి తెలుగు రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ తెలిపారు. గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా కృష్ణా బేసిన్‌కు ఏపీ మళ్లించిందని.. అందులో తెలంగాణకు 45 టీఎంసీల నీటి వాటా రావాలని ఆయన తెలిపారు. అలాగే సీలేరు ప్రాజెక్టులో తెలంగాణ వాటాపై కూడా చర్చించినట్లు చెప్పారు. తెలంగాణకు చెందిన చనాకా-కొరాటా, చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకాల డీపీఆర్‌లు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెంకటనగరం పంప్‌హౌస్‌, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుల డీపీఆర్‌లపై చర్చ జరిగినట్లు వెల్లడించారు. ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ నుంచి అన్ని వివరాలు స్పష్టంగా ఉన్నాయని.. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను సీడబ్ల్యూసీకి పంపించినట్లు తెలిపారు. ఏపీ లేవనెత్తిన అభ్యంతరాలను జీఆర్‌ఎంబీ ఛైర్మన్‌ తిరస్కరించారని.. తాము లేవనెత్తిన అన్ని అంశాలను ఆయన పరిగణనలోకి తీసుకున్నారని రజత్‌ కుమార్ వివరించారు. తెలంగాణ నీటిని ఏపీ వాడుకుంటోందని ఆయన ఆరోపించారు.

గోదావరి జలాలపై ట్రైబ్యునల్‌ వేయాలి: శశిభూషణ్‌

తెలంగాణ తలపెట్టిన 3 ఎత్తిపోతల ప్రాజెక్టులపై సమావేశంలో చర్చించినట్లు ఏపీ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌ వెల్లడించారు. ‘‘మూడు ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాలను చెప్పాం. 3 ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు లేవు. గోదావరిలో నీటి లభ్యతపై అధ్యయనం చేయాలని కోరాం. గోదావరి జలాలపై ట్రైబ్యునల్‌ వేయాలని కోరాం. గోదావరిలో నీటి లభ్యతపై కేంద్రం అధ్యయనం చేయాలి. శ్రీశైలం, సాగర్‌ ప్రాజెక్టుల భద్రతపై పాండ్య కమిటీ రిపోర్టు ఇచ్చింది. ఎవరికెంత కేటాయింపులనేది తేల్చాలని కోరాం’’ అని శశిభూషణ్‌ తెలిపారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని