GRMB: ఏపీ గైర్హాజరు.. గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా

గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) 13వ సమావేశం చర్చ జరగకుండానే వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్‌

Updated : 22 Apr 2022 14:55 IST

హైదరాబాద్‌: గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) 13వ సమావేశం చర్చ జరగకుండానే వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున నీటిపారుదల శాఖ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సమావేశానికి గైర్హాజరు కావడంతో భేటీ జరగలేదు. ఏపీ, తెలంగాణ సభ్యులుగా ఉన్న గోదావరి బోర్డు సమావేశం ఛైర్మన్‌ ఎం.పి.సింగ్ అధ్యక్షతన జరగాల్సి ఉంది. తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే, ఇంజినీర్లు  సమావేశానికి హాజరయ్యారు. ఏపీ నుంచి ఎవరూ హాజరుకాకపోవడంతో ఛైర్మన్‌ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

ఉద్దేశపూర్వకంగానే సమావేశానికి హాజరుకాలేదు: రజత్‌కుమార్‌

ఏపీ సభ్యులు ఉద్దేశపూర్వకంగానే సమావేశానికి హాజరుకాలేదని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ అసహనం వ్యక్తం చేశారు. ‘‘మూడు తెలంగాణ ప్రాజెక్టుల డీపీఆర్‌లకు బోర్డు ఆమోదం తెలపాల్సి ఉంది. సమావేశానికి ఏపీ సభ్యులు రాకపోవడంతో అనుమతులకు ఆలస్యం అవుతోంది. గత సమావేశానికి కూడా ఏపీ సభ్యులు హాజరు కాలేదు. సీతారామ, తుపాకులగూడెం ప్రాజెక్టులకు హైడ్రలాజికల్‌ అనుమతి వచ్చింది. అన్ని ప్రాజెక్టులకు జులై లోపు అనుమతి వస్తుందని భావిస్తున్నాం. కృష్ణా జలాలపై కేంద్రం ఇంకా ట్రైబ్యునల్‌కు నివేదించడం లేదు’’ అని రజత్‌కుమార్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని