TSPSC: 783 గ్రూప్‌-2 పోస్టులు 5,51,943 దరఖాస్తులు.. ముగిసిన గడువు

తెలంగాణలో గ్రూప్‌-2 దరఖాస్తుల గడువు ముగిసింది. మొత్తం 783 పోస్టులకు 5,51,943 మంది దరఖాస్తు చేసుకున్నారు.

Updated : 16 Feb 2023 21:55 IST

హైదరాబాద్‌: తెలంగాణలో గ్రూప్‌-2 ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు గడువు ముగిసింది. 783 పోస్టులకు గానూ 5,51,943 దరఖాస్తులు వచ్చినట్లు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) తెలిపింది. గ్రూప్‌-2 పరీక్ష తేదీలను త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది.

గ్రూప్‌-2 పోస్టులకు జనవరి 18వ తేదీ నుంచి ఆన్ లైన్‌లో దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. చివరి మూడు రోజుల్లోనే 1.10లక్షల దరఖాస్తులు రావడం గమనార్హం. చివరి రోజు 68వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. కొందరు అభ్యర్థుల ఫీజు చెల్లింపులు సర్వర్ నుంచి ఖరారైన తర్వాత మొత్తం దరఖాస్తుల సంఖ్యలో స్వల్ప మార్పులుండే అవకాశం ఉందని టీఎస్‌పీఎస్సీ అధికారులు చెబుతున్నారు. గ్రూప్-2 పరీక్షకు ఒక్కో పోస్టుకు సగటున 705 మందికి చొప్పున పోటీ పడనున్నారు. పరీక్షా తేదీని వచ్చే వారంలో నిర్ణయించనున్నారు. ఇతర పోటీ పరీక్షల తేదీలను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే పరీక్షా తేదీని అధికారులు వెల్లడించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని