TSPSC: తెలంగాణలో గ్రూప్‌-4 నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణలో గ్రూప్‌-4 నోటిఫికేషన్‌ విడుదలైంది. 9,168 పోస్టులు గ్రూప్‌-4 ద్వారా భర్తీ చేయనున్నట్టు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది.

Updated : 20 Dec 2022 13:23 IST

హైదరాబాద్‌: తెలంగాణలో గ్రూప్‌-4 నోటిఫికేషన్‌ విడుదలైంది. 9,168 పోస్టులు గ్రూప్‌-4 ద్వారా భర్తీ చేయనున్నట్టు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. ఈనెల 23 నుంచి జనవరి 12 వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపింది. ఏప్రిల్‌ లేదా మే నెలలో పరీక్ష నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు. అర్హతలు, ఖాళీలు, వేతనం తదితర వివరాలతో సమగ్ర నోటిఫికేషన్‌ ఈనెల 23 నుంచి టీఎస్‌పీస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని కమిషన్‌ కార్యదర్శి తెలిపారు. 25 విభాగాల్లో ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు.

గ్రూప్-4 విభాగంలో 9,168 పోస్టులను భర్తీ చేయనున్నట్లు బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా టీఎస్‌పీఎస్‌సీ  నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గ్రూప్‌-4లో మరో 4 రకాల పోస్టులను ప్రభుత్వం చేర్చింది. ఈమేరకు గతంలో ఇచ్చిన ఉత్వర్వులను ఇటీవలే సాధారణ పరిపాలన శాఖ సవరించింది. గ్రూప్‌-4లో జిల్లా కార్యాలయాల్లో జూనియర్‌ అసిస్టెంట్‌, అకౌంటెంట్‌, జువైనల్‌ సర్వీసెస్‌ సూపర్‌ వైజర్‌ మేల్‌, జువైనల్‌ సర్వీసెస్‌ మ్యాట్రన్‌ స్టోర్‌ కీపర్‌, సాంకేతిక విద్యాశాఖ మ్యాట్రన్‌ పోస్టులు చేర్చినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. తాజాగా టీఎఎస్‌పీఎస్సీ విడుదల చేసిన గ్రూప్‌-4 నోటిఫికేషన్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అకౌంటెంట్‌, జూనియర్‌ ఆడిటర్‌, వార్డ్‌ ఆఫీసర్‌ పోస్టులు భారీగా ఉన్నాయి.

శాఖల వారీగా పోస్టుల వివరాలు..

* పట్టణాభివృధ్ధి, పురపాలిక విభాగంలో 2,701 పోస్టులు.

* రెవెన్యూ శాఖలో 2,077 పోస్టులు.

* పంచాయతీరాజ్‌ శాఖలో 1,245 పోస్టులు.

* ఉన్నత విద్యాశాఖలో 742 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని