Manipur: ఔరా సాహస వీరా.. నిమిషంలో 109 పుష్-అప్లు
మనిషనుకుంటే కానిది ఏముంటుందని మణిపూర్‌కు చెందిన 24 ఏళ్ల యువకుడు నిరూపించాడు. నిమిషంలో అత్యధిక పుష్-అప్లు..
ఇంఫాల్: పది నిమిషాల్లో 100 పుష్-అప్లు అంటే కొద్దిగా కష్టమైనా చాలా మంది చేసేస్తామంటారు.. అది ఐదు నిమిషాల్లో చేయాలంటే.. కాస్త వెనకడుగు వేయక మానరు. ఇక నిమిషంలో ఈ సాహసం పూర్తి చేయాలంటే.. అమ్మో ఇది మనతో కాదులే అని చేతులెత్తేస్తారు. కానీ, మణిపూర్‌కు చెందిన 24 ఏళ్ల యువకుడు అలా అనుకోలేదు. మనిషి తలుచుకుంటే కానిది ఏముంటుందని నిరూపించాడు. ఆయువే ఆశయ సాధనంగా నిమిషంలో 109 పుష్-అప్లు చేసి ఔరా సాహస వీరా అనిపించాడు.
మణిపూర్‌కు చెందిన 24 ఏళ్ల యువకుడు నిరంజోయ్ సింగ్ నిమిషంలో అత్యధిక పుష్-అప్లు (ఫింగర్స్ టిప్స్) చేసి కొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. అంతకుముందే రెండుసార్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ అయిన నిరంజోయ్.. నిమిషంలో 109 పుష్-అప్లు చేసి తన పాత రికార్డు (105)ను బద్దలు కొట్టాడు. ఇంఫాల్‌లోని అజ్టెక్ ఫైట్ స్టూడియోలో అజ్టెక్స్ స్పోర్ట్స్ మణిపూర్ నిర్వాహకులు గతవారం చేపట్టిన వేడుకలో నిరంజోయ్ ఈ రికార్డును నెలకొల్పాడు. ఇందుకు సంబంధించి వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఈ మేరకు మణిపూర్ యువకుడికి అభినందనలు తెలుపుతూ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు. ‘నమ్మశక్యం కాని ఈ మణిపురి యువకుడి శక్తిని చూడటం ఆశ్చర్యంగా ఉంది. నిమిషంలో అత్యధిక పుష్-అప్లు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌ను బద్దలు కొట్టిన నిరంజోయ్ విజయానికి గర్వపడుతున్నా’ అని రిజిజు అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
CM Revanth: ఈనాడు-ఈటీవీ కథనంపై స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఆదుకుంటామని హామీ
ఈనాడు-ఈటీవీ తెలంగాణ కథనానికి సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. మెదడు సంబంధిత సమస్యతో బాధపడుతున్న బాలుడి పరిస్థితిని వివరిస్తూ ఈనాడు-ఈటీవీలో కథనం వచ్చింది. -
MLC Kavitha: సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న కవిత
దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన కవిత.. సుప్రీంకోర్టులో వేసిన రిట్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. ఈడీ సమన్లు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను ఆమె ఉపసంహరించుకున్నారు. -
TS News: తమిళిసై రాజీనామాకు ఆమోదం.. ఝార్ఖండ్ గవర్నర్‌కు అదనపు బాధ్యతలు
తెలంగాణ గవర్నర్‌గా ఝార్ఖండ్ గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. -
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
రుషికొండలో ఏం జరిగింది?!
ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంటిలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సోమవారం రాత్రి తీవ్ర కలకలం రేగింది. -
గత లోపాలు పునరావృతం కాకుండా చందనోత్సవం
సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవం గత ఏడాది ఘోరంగా విఫలమైన నేపథ్యంలో ఈ ఏడాది ఉత్సవాన్ని పక్కా ప్రణాళికతో విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ సింహాచలం దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తిని ఆదేశించారు. -
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
TS High Court: తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు
తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు బదిలీపై రానున్నారు. ఈమేరకు కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
Hanu Man: ఓటీటీలో ‘హనుమాన్’ క్రేజ్ మామూలుగా లేదుగా.. 2024లో ఇదో సరికొత్త రికార్డు
-
Bengaluru: బెంగళూరులో పేలుడు పదార్థాలు స్వాధీనం
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Stock market: భారీ నష్టాల్లో మార్కెట్లు.. పతనానికి కారణాలు ఇవే!
-
CM Revanth: ఈనాడు-ఈటీవీ కథనంపై స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఆదుకుంటామని హామీ
-
Pashupati Paras: అబ్బాయితో భాజపా దోస్తీ.. కేంద్రమంత్రి పదవికి బాబాయ్ రాజీనామా