Ballpoint Pen: గిన్నిస్‌లో ‘మన బాల్‌పాయింట్ పెన్ను’
జీవితంలో ఈ పెన్నును మనందరం ఎప్పుడో ఒకప్పుడు వాడి ఉంటాము. మన పాఠశాల రోజుల నుంచి కళాశాల రోజుల వరకు ఈ పెన్ను భాగమైపోయింది. ఇలా మనం రోజు ఉపయోగించే బాల్ పాయింట్ పెన్ను ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: జీవితంలో పెన్నును మనందరం ఎప్పుడో ఒకప్పుడు వాడి ఉంటాము. మన పాఠశాల రోజుల నుంచి కళాశాల రోజుల వరకు పెన్ను భాగమైపోయింది. ఇలా మనం రోజు ఉపయోగించే బాల్ పాయింట్ పెన్ను ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. ఎలా అనుకుంటున్నారా అయితే ఇది చదవండి. ప్రపంచంలోనే అతిపెద్ద బాల్ పాయింట్ పెన్నును నమోదు చేసినట్టు గిన్నిస్ వరల్డ్ రికార్ట్ ప్రకటించింది. దీని పొడవు 18 అడుగుల 0.53 అంగుళాలు, బరువు 37.23 కిలోలు ఉంటుంది. దీనిని కచ్చితంగా ఎవరూ ఉపయోగించలేరని అంటున్నారు ఈ పెన్ను సృష్టికర్త ఆచార్య మాకునూరి శ్రీనివాస.
ఈ పెన్ను గురించి గిన్నిస్ వరల్డ్ రికార్డు తన అధికారిక ఇన్‌స్టా గ్రామ్ పేజీలో ‘భారతీయ పురాణాలలోని దృశ్యాలతో చెక్కిన ఈ బాల్ పెన్నును భారతదేశానికి చెందిన ఆచార్య మాకునూరి శ్రీనివాస రూపొందించారు. ఈ పెన్ను 18 అడుగుల పొడవు ఉంది. గతంలో అత్యంత పెద్ద పెన్నుగా ఉన్న 4 అడుగుల పెన్ను రికార్డును ఇది అధిగమించింది’ అని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను అధికారిక యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసింది.
దీనిని తయారు చేసిన ఆచార్య మాట్లాడుతూ ‘చిన్నప్పుడు మా అమ్మ నాకు రాసుకోడానికి పెన్ను ఇచ్చినప్పుడల్లా ఎప్పటికైనా ఒక ప్రత్యేకమైన పెన్నును తయారుచేయాలని అనుకొనే వాడిని. ఈ పెన్నును ఇత్తడితో తయారు చేశాము.దీనిపై తొమ్మిది రకాల నృత్య భంగిమలు, భారతీయ సంగీత వాయిద్యాలను చెక్కాము. దీనిని కచ్చితంగా ఎవరూ ఉపయోగించలేరు. ఎందుకంటే దీనిని మోయడానికే నలుగురు కావాలి’అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్‌రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్‌లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్‌లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్‌రెడ్డి