Cafe: ప్లాస్టిక్ వ్యర్థాలు ఇవ్వండి.. రుచికరమైన భోజనం అందిస్తాం.. ఓ కేఫ్ వినూత్న ప్రకటన
ఇంటర్నెట్ డెస్క్: గుజరాత్‌లోని ఓ కేఫ్ వినూత్న ప్రకటన ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్లాస్టిక్ వ్యర్థాలు అందజేస్తే.. రుచికరమైన భోజనం అందిస్తామంటూ ప్రకటించి ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. గుజరాత్‌లోని జునాగఢ్‌కు చెందిన ‘నేచురల్ ప్లాస్టిక్ కేఫ్’ ప్రకటన వైరల్‌గా మారింది. జులై 1నుంచి పలు ప్లాస్టిక్ వస్తువులపై కేంద్రం నిషేధం విధించిన నేపథ్యంలో కేఫ్ ఈ తాజా ప్రకటన చేయడం విశేషం. ఆహార పదార్థాలను కొనుగోలు చేసేసమయంలో వినియోగదారులు బిల్లును డబ్బు రూపంలో చెల్లించేబదులు ప్లాస్టిక్ వర్థాలను ఇచ్చినా.. స్వీకరిస్తామంటూ కేఫ్ తెలిపింది.
నేచురల్ ప్లాస్టిక్ కేఫ్‌ను సర్వోదయ సాక్షి సంఘం అనే మహిళల బృందం నిర్వహించడం విశేషం. ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకొని వాటికి బదులుగా.. సంప్రదాయ గుజరాతీ వంటకాలను అందిస్తున్నారు. సెవ్ టమోటా, బైంగన్ బర్తా, బజ్రా రోట్లా వంటి విభిన్న వంటకాలు ఈ జాబితాలో ఉన్నాయి. గులాబీ, అత్తి పండ్లు, బెల్ ఆకులు, తమలపాకుతో చేసిన కొన్ని వంటకాలను కూడా అందిస్తున్నారు. ఈ కేఫ్ ప్రకటనను కలెక్టర్ రుచిత్ రాజ్ తన ట్విటర్ ఖాతాలో పంచుకోగా.. కేఫ్ నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదో గొప్ప ముందడుగని కొనియాడుతున్నారు.
ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్ వస్తువులపై జులై 1 నుంచి దేశవ్యాప్తంగా నిషేధం అమల్లోకి వచ్చింది. ముఖ్యంగా తక్కువ పరిమాణం కలిగిన ఒకేసారి వాడిపారేసే ప్లాస్టిక్ వస్తువులను తయారు చేయడం, దిగుమతి చేసుకోవడం, నిల్వ ఉంచుకోవడం, సరఫరా, అమ్మకంతోపాటు వినియోగాన్ని కూడా పూర్తిగా నిషేధిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి నిషేధిత జాబితాలో ఏయే వస్తువులు ఉన్నాయో తెలియజేస్తూ ఓ ప్రకటన జారీ చేసింది. ఇయర్‌బడ్స్, ప్లాస్టిక్ జెండాలు, అలంకరణ కోసం వాడే థర్మోకోల్ తదితర వస్తువులు ఈ జాబితాలో ఉన్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Chandrababu: ఆంబోతులు బట్టలిప్పి తిరుగుతుంటే చూస్తూ ఉండాల్సి వస్తోంది: చంద్రబాబు
-
Crime News
Crime News: నల్గొండలో దారుణం.. ప్రేమ పేరుతో వేధించి హత్యాయత్నం
-
Sports News
Team India: ‘అర్ష్‌దీప్ రూపంలో టీమ్ఇండియాకు అసలైన లెఫ్టార్మ్ బౌలర్ దొరికాడు’
-
Viral-videos News
Viral Video: రోడ్డుపై నీటి గుంత.. అందులోనే స్నానం చేస్తూ వ్యక్తి నిరసన!
-
Politics News
Ap News: గోరంట్ల మాధవ్‌ను మేం రక్షించడం లేదు: హోం మంత్రి వనిత
-
Movies News
Social Look: నయన్-విఘ్నేశ్ వెడ్డింగ్ ప్రోమో.. అనుపమ విజయవాడ ప్రయాణం..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Money: వ్యక్తి అకౌంట్లోకి రూ.6వేల కోట్లు.. పంపిందెవరు?
- Andhra news: నడిరోడ్డుపై వెంటాడి కానిస్టేబుల్ హత్య
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (09/08/2022)
- Chile sinkhole: స్టాట్యూ ఆఫ్ యూనిటీ మునిగేంతగా.. విస్తరిస్తోన్న చిలీ సింక్ హోల్..!
- Vijay Deverakonda: బాబోయ్.. మార్కెట్లో మనోడి ఫాలోయింగ్‌కి ఇంటర్నెట్ షేక్
- Sita Ramam: బాలీవుడ్, టాలీవుడ్లో నాకు ఆ పరిస్థితే ఎదురైంది: రష్మిక
- Harmanpreet Kaur: ప్రతిసారి ఫైనల్స్‌లో మేం అదే తప్పు చేస్తున్నాం: హర్మన్‌ప్రీత్ కౌర్
- దంపతుల మాయాజాలం.. తక్కువ ధరకే విమానం టిక్కెట్లు, ఐఫోన్లంటూ..
- ASIA CUP 2022: నేను సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా ఉంటే కచ్చితంగా అతడిని ఎంపిక చేస్తా: మాజీ సెలక్టర్
- Railway ticket booking: 5 నిమిషాల ముందూ ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు..!