బొమ్మ తుపాకీ కాదు.. నిజమైందే!

పైఫొటోలో కనిపిస్తున్న తుపాకీ ఎలా ఉంది? బొమ్మ తుపాకీ రంగు రంగులతో భలే ఉంది అనుకుంటున్నారా? అది బొమ్మ తుపాకీ కాదండి.. అసలైన తుపాకే. యూఎస్‌లోని ఉతాకు చెందిన కల్పర్‌ ప్రెసిషన్‌ అనే ఆయుధాల ఉత్పత్తి సంస్థ దీన్ని తయారు చేసింది. బ్లాక్‌-19 సిరీస్‌లో తయారు

Published : 16 Jul 2021 23:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పైఫొటోలో కనిపిస్తున్న తుపాకీ ఎలా ఉంది? రంగు రంగులతో భలే ఉంది అనుకుంటున్నారా? అది బొమ్మ తుపాకీ కాదండీ.. అసలైన తుపాకే. యూఎస్‌లోని ఉతాకు చెందిన కల్పర్‌ ప్రెసిషన్‌ అనే ఆయుధాల ఉత్పత్తి సంస్థ దీన్ని తయారు చేసింది. బ్లాక్‌-19 పేరుతో మార్కెట్లోకి తెచ్చిన ఈ తుపాకీ అచ్చం పిల్లలు ఆడుకునే లెగో బ్రిక్స్‌తో చేసిన బొమ్మ తుపాకీలా కనిపిస్తోంది. ఇటీవల ఈ తుపాకీల విక్రయం నెట్టింట్లో వైరల్‌ అయింది. దీంతో అధికారికంగా ఆయుధాలు కొనుగోలు చేసేవారితోపాటు.. నెటిజన్లు కంపెనీపై మండిపడుతున్నారు. మనుషుల ప్రాణాలు తీసే అసలైన తుపాకీని ఈ విధంగా తయారు చేస్తే పిల్లలు దీన్ని బొమ్మ తుపాకీ అనుకునే అవకాశముందని ఆక్షేపించారు. ఈ తుపాకీని ప్రమాదకరంగా తయారు చేశారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

లెగో సంస్థ కూడా ఆ తుపాకీ తాము తయారు చేసే బ్రిక్స్‌లతో తయారు చేసినట్లుగా ఉందని అభ్యంతరం వ్యక్తం చేస్తూ కల్పర్‌ ప్రెసిషన్‌ కంపెనీకి నోటీసులు జారీ చేసింది. విమర్శలు, నోటీసులు రావడంతో ఆ కంపెనీ బొమ్మ తుపాకీలా కనిపించే బ్లాక్‌-19 తుపాకీల ఉత్పత్తిని నిలిపివేసింది. అయితే, క్షమాపణ చెప్పకపోవడం గమనార్హం. కస్టమర్లు తమకు నచ్చిన వస్తువును నచ్చిన విధంగా కస్టమైజ్‌ చేసుకునే హక్కు ఉందంటూ బొమ్మ తుపాకీ తయారీని సమర్థించుకునే ప్రయత్నం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని