Hair Care: మీ జుట్టు రాలుతోందా! కారణాలు తెలుసుకోండి!

చాలామంది ఎదుర్కొంటున్న సమస్య జుట్టు రాలడం. వాతావరణంలో వచ్చే మార్పులు, తినే ఆహారం.. ఇలా ఎన్నో జుట్టు రాలేందుకు కారణమవుతున్నాయి. జుట్టు రాలిపోవడం సాధారణమే. కానీ ఆ స్థానంలో కొత్త జుట్టు రాకపోవటమే ప్రధాన సమస్య. ఇలా ఎందుకు జరుగుతుంది. ముఖ్యమైన కారణాలేంటో తెలుసుకోండి.

Published : 02 Oct 2022 01:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చాలామంది ఎదుర్కొంటున్న సమస్య జుట్టు రాలడం. వాతావరణంలో వచ్చే మార్పులు, తినే ఆహారం.. ఇలా ఎన్నో కారణాలు జుట్టు రాలేందుకు దోహదపడుతున్నాయి. జుట్టు రాలిపోవడం సాధారణమే. కానీ ఆ స్థానంలో కొత్త జుట్టు రాకపోవటమే ప్రధాన సమస్య. ఇలా ఎందుకు జరుగుతుంది. ముఖ్యమైన కారణాలేంటో తెలుసుకోండి.


తలస్నానం చేసిన వెంటనే... 

తలస్నానం చేసిన వెంటనే తలను దువ్వుతున్నారా! ఇది మీ కురుల ఎదుగుదలను ఆపేయడమే కాకుండా ఉన్న జుట్టును కూడా రాలిపోయేలా చేస్తుంది. 

హెయిర్‌ డ్రైయర్‌లు.. 

 తలస్నానం చేసిన తర్వాత చాలామంది వెంట్రుకలు ఆరాలని హెయిర్‌ డ్రైయర్‌లు వాడుతుంటారు. ఈ పద్ధతి మంచిది కాదు. దీనిలో నుంచి వచ్చే వేడి గాలులు కురులకు ఎంతో హాని చేస్తాయి. దీంతో జుట్టు ఎక్కువగా రాలిపోతుంది.  

నూనెలు, షాంపూలు మార్చడం.. 

కొంతమంది తరచూ వాడే నూనెలను, షాంపూలను మార్చుతుంటారు. దీనివల్ల వెంట్రుకలు ఎక్కువగా రాలిపోతుంటాయి. అందుకే ఎప్పుడూ ఒకే రకమైన నూనె, షాంపూ వాడాలి. తక్కువ రసాయనాలు ఉన్న షాంపూలను ఎంచుకోవాలి. 

కురులను పట్టించుకోకపోవడం..  

శరీరాన్ని పట్టించుకున్నట్లే కురులను కూడా పట్టించుకోవాలి. వారానికి రెండుసార్లు తలస్నానం చేయాలి. వెంట్రుకలకు నూనె రాసుకోవాలి. వారానికి ఒకసారి హెయిర్‌ ప్యాక్ వేసుకోవాలి.  

కత్తిరించేయండి.. 

కురులు చివర్లో నిర్జీవంగా ఉంటాయి. వీటిని నెలకొకసారి లేదా మూడు నెలలకోసారి కత్తిరించుకోవాలి. దీంతో కురులు ఒత్తుగా పెరుగుతాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని