Jobs: యువతకు గడ్డుకాలం నడుస్తోంది

ఉద్యోగావకాశాల్ని వెతుకుంటున్న యువతను కరోనా రెండో దశ తీవ్రంగా కుంగదీస్తోంది. ముఖ్యంగా 18 - 24 ఏళ్ల మధ్య యువతపై దీని ప్రభావం ఎక్కువగా ఉంది. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నా.. కంపెనీ యాజమాన్యం వారిని నిరాకరిస్తుండటంతో పదిలో తొమ్మిది

Published : 16 Jul 2021 01:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉద్యోగావకాశాల్ని వెతుకుంటున్న యువతను కరోనా రెండో దశ తీవ్రంగా కుంగదీస్తోంది. ముఖ్యంగా 18 - 24 ఏళ్ల మధ్య యువతపై దీని ప్రభావం ఎక్కువగా ఉంది. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నా.. కంపెనీ యాజమాన్యం వారిని నిరాకరిస్తుండటంతో పదిలో తొమ్మిది మంది నిరాశకు గురవుతున్నట్లు లింక్డ్‌ఇన్‌ సంస్థ చేసిన సర్వేలో తేలింది.

గత నెలలో లింక్డ్‌ఇన్‌ సంస్థ జర్మనీకి చెందిన జీఎఫ్‌కే అనే పరిశోధన సంస్థతో కలిసి 1997 తర్వాత జన్మించిన వారి ఉద్యోగ భవిష్యత్తుపై సర్వే నిర్వహించింది. సర్వేలో పాల్గొన్న వెయ్యి మందిలో 70శాతం మంది ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటే కంపెనీ యాజమాన్యాలు ఆ దరఖాస్తులను రద్దు లేదా వాయిదా వేస్తున్నాయని తెలిపారు. 

కరోనా కాలంలో కెరీర్‌ ముందుకెళ్లడానికి అడ్డుపడుతున్న అంశాల గురించి ప్రశ్నించగా.. తక్కువ ఉద్యోగావకాశాలు, నిదానంగా నడిచే నియామక ప్రక్రియ, పెరిగిన పోటీ వల్ల ఉద్యోగాలు దొరకట్లేదని వెల్లడించారు. అలాగే కరోనా సంక్షోభంలో అన్ని విద్యా సంస్థలు మూతపడటం.. నైపుణ్యం పొందడానికి సరైన మార్గదర్శకులు లేకపోవడం, కరోనా కష్టాలతో ఇంట్లో బాధ్యతలు మీద పడటం వంటివి కూడా ఉద్యోగం వెతుక్కోవడంలో ఆటంకాలుగా మారాయని తెలిపారు. ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు కూడా భారీగా తగ్గిపోయాయని 72 శాతం మంది చెప్పారు. 

అంతేకాదు, కరోనా సంక్షోభంలో ఉద్యోగాలు సరిగా లేవని 40శాతం మంది ఉన్నత చదువులు చదివిన అభ్యర్థులు తమ ఉద్యోగాన్వేషణను వాయిదా వేసుకున్నారు. ఉద్యోగాలు ఉన్న 32 శాతం మంది తమ జీతాల్లో కోత పడిందని తెలిపారు. మరో 25శాతం మంది ఉద్యోగం వచ్చినా కంపెనీలు చివరి నిమిషంలో ఉద్యోగాలను రద్దు చేయడంతో నిరుదోగ్యులైన వారున్నారు. కాగా.. సర్వే ఫలితాలపై స్పందించిన లింక్డ్‌ఇన్‌ ఇండియా మేనేజర్‌ అశుతోష్‌ గుప్తా.. యువత కెరీర్‌లో వెనకబడిపోకుండా కంపెనీలు వారిని నియమించుకొని నైపుణ్యం పెంచేలా తగిన మార్గాలు చూడాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని