AP HighCourt: కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్.. హైకోర్టులో పిటిషన్‌

కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి 5శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ హైకోర్టులో (AP HighCourt) పిటిషన్‌ దాఖలైంది.

Updated : 06 Feb 2023 17:33 IST

అమరావతి: ఈడబ్ల్యూఎస్‌ (EWS) కోటా కింద కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి 5 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలంటూ మాజీ మంత్రి, కాపు సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు హరిరామజోగయ్య (Hari rama Jogaiah) హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కాపులు నేటికీ ఆర్థికంగా ఎంతో వెనుకబడి ఉన్నారని, అనేక ఇబ్బందులు పడుతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద రిజర్వేషన్‌ కల్పించేలా.. ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టునును కోరారు. జోగయ్య పిటిషన్‌పై రేపు విచారణ జరిగే అవకాశముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని