TTD: తిరుమలలో అత్యుత్తమ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తాం: హరీశ్‌ కుమార్‌ గుప్తా

ఆగమ శాస్త్రం ప్రకారం తిరుమలలో అవసరమైన టెక్నాలజీని ఉపయోగించి ప్రపంచంలోనే అత్యుత్తమ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని  హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ హరీశ్‌ కుమార్‌ గుప్తా తెలిపారు.

Published : 24 May 2023 18:49 IST

తిరుమల: ఆగమ శాస్త్రం ప్రకారం తిరుమలలో అవసరమైన టెక్నాలజీని ఉపయోగించి ప్రపంచంలోనే అత్యుత్తమ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని  హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ హరీశ్‌ కుమార్‌ గుప్తా తెలిపారు. తిరుమల భద్రతా కమిటీ ముఖ్య అధికారిగా నియమితులైన హరీశ్‌ కుమార్‌ గుప్తా  నిన్న, ఈరోజు తిరుమల అన్నమయ్య భవన్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏడు విభాగాల నిపుణుల కమిటీ సభ్యులతో పాటు ఐజీ శశిధర్‌రెడ్డి, అనంతపురం రేంజ్‌ డీఐజీ అమ్మిరెడ్డి, తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి, తితిదే సీవీఎస్‌వో నరసింహ కిషోర్‌, తితిదే జేఈవో వీరబ్రహ్మం తదితరులతో భద్రతపై సమీక్షించిన హరీశ్‌కుమార్‌ పలు కీలక సూచనలు చేశారు. 

అనంతరం అధికారులతో కలిసి  శ్రీవారి ఆలయం, మాడవీధులు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లు, ఆర్టీసీ బస్ స్టేషన్లు, ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, వాటర్ పంపింగ్ హౌస్, నారాయణగిరి ఉద్యానవనం, క్యూలైన్లు, సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ తదితర ప్రాంతాలను పరిశీలించారు. ఏడు విభాగాల నిపుణుల కమిటీ సభ్యులు 15 రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి, ఇప్పుడు అమలవుతున్న భద్రతాపరమైన అంశాలను పరిశీలించి, గతంలో భద్రత కమిటీ ఇచ్చిన సిఫార్సులను పరిశీలించి ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే గుర్తించాలని హరీశ్‌ కుమార్‌ గుప్తా ఆదేశించారు. తిరుమలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అనుసంధానిస్తూ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తామన్నారు. తనిఖీలు మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు బాడీ స్కానర్స్ ఏర్పాటుకు ప్రతిపాదించినట్టు చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు