TS news : ప్రసవం చేయడానికి నిరాకరించిన డాక్టర్‌...హరీశ్‌రావు ఆగ్రహం

నాగర్‌ కర్నూల్‌ జిల్లా అచ్చంపేటలో విధి నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహించిన డ్యూటీ డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు  అధికారులను ఆదేశించారు. కొవిడ్ పాజిటివ్ సోకిన మహిళకు ప్రసవం చేయడానికి నిరాకరించిన డాక్టర్‌పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు...

Published : 26 Jan 2022 01:45 IST

అచ్చంపేట : నాగర్‌ కర్నూల్‌ జిల్లా అచ్చంపేటలో విధి నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహించిన డ్యూటీ డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. కొవిడ్ పాజిటివ్ సోకిన మహిళకు ప్రసవం చేయడానికి నిరాకరించిన డాక్టర్‌పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పురిటినొప్పులతో వచ్చిన మహిళలకు కొవిడ్ పాజిటివ్‌ ఉన్నా సరే కచ్చితంగా ప్రసవం చేయాల్సిందేనని వైద్యులను ఆదేశించారు. మరోవైపు కరీంనగర్‌ జిల్లా 100శాతం రెండు డోసుల వ్యాక్సినేషన్‌ను పూర్తి చేసుకుంది. దక్షిణ భారత దేశంలో వందశాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేసుకున్న రెండో జిల్లాగా, తెలంగాణలో తొలి జిల్లాగా నిలిచింది. దీనిపై జిల్లా యంత్రాంగాన్ని మంత్రి అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని