TS News: రోబోటిక్‌ సర్జరీ థియేటర్‌ ప్రారంభించిన హరీశ్‌రావు

హైదరాబాద్ నగరంలోని ఎంఎన్‌జే ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన రోబోటిక్ సర్జరీ థియేటర్‌ను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. 

Published : 19 Sep 2023 01:33 IST

హైదరాబాద్‌: క్యాన్సర్ చికిత్సలో తెలంగాణ అత్యుత్తమ ఫలితాలు సాధిస్తోందని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. హైదరాబాద్ నగరంలోని ఎంఎన్‌జే ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన రోబోటిక్ సర్జరీ థియేటర్‌ను ఆయన సోమవారం ప్రారంభించారు. రూ.34 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ రోబోటిక్ థియేటర్ ద్వారా ఎంతోమంది రోగులకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చన్నారు. దేశంలోనే మూడో అతిపెద్ద ప్రభుత్వ క్యాన్సర్ ఆస్పత్రిగా ఎంఎన్‌జే నిలిచిందన్న ఆయన... రూపాయి ఖర్చు లేకుండా బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్లను సైతం ఈ ఆస్పత్రిలో నిర్వహిస్తున్నట్టు వివరించారు. ఇక క్యాన్సర్‌తో అవసానదశలో బాధపడుతున్న వారి కోసం పాలియేటివ్ సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు. అవసరమైన వారికి ఇంటివద్దే పాలియేటివ్ సేవలు అందిస్తున్నట్టు మంత్రి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని