గూగుల్‌ మాస్క్ సాంగ్‌.. మీరూ వినేయండి

ప్రజలందరూ కరోనా మాస్కులు ధరించేలా ప్రోత్సహించేందుకు ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ ఓ మాస్క్‌ సాంగ్‌ను రూపొందించింది.

Updated : 08 Dec 2022 18:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్-19 నిరోధానికి మాస్కులు ధరించటం తప్పనిసరి. ఇది వరకూ లేని ఈ అలవాటు ఇప్పుడు తప్పనిసరి కావటం పలువురికి చిరాకు తెప్పిస్తోంది. మరిచిపోయి మరికొందరు వీటిని ధరించడం మానేస్తున్నారు. ఈ విధంగా జరగకుండా... ప్రజలందరూ కరోనా మాస్కులు ధరించేలా ప్రోత్సహించేందుకు ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ ఓ మాస్క్‌ సాంగ్‌ను రూపొందించింది. దాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా షేర్‌ చేసింది.

ఈ సాంగ్‌లో మాస్క్‌ను ఎలా, ఎక్కడ, ఎప్పుడు ధరించాలో వివరించారు. ఆకట్టుకునే సంగీతంతో, నర్సరీ రైమ్‌ను పోలి ఉన్న ఈ పాటను గూగుల్‌ అసిస్టెంట్‌ ద్వారా నేర్చుకోవచ్చని, కలిసి పాడవచ్చని గూగుల్‌ వివరించింది. ఇందుకుగాను గూగుల్‌ అసిస్టెంట్‌తో ‘‘హే గూగుల్‌, సింగ్‌ ద మాస్క్‌ సాంగ్‌’’ అని చెప్పాల్సి ఉంటుంది. హుషారైన ఈ మాస్క్ పాట నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. మరి ఈ సరదా గీతాన్ని మీరూ వినేయండి..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు