Anand Mahindra: అర్ధరాత్రి యువకుడి పరుగు.. ఆనంద్‌ మహీంద్రా ఏమన్నారంటే..?

ఆర్మీలో చేరాలన్న కల ఉన్నా.. ఆర్థిక స్తోమత కారణంగా శిక్షణ తీసుకోలేక.. నోయిడా వీధుల్లో అర్ధరాత్రి పరిగెడుతూ వెళ్తోన్న 19 ఏళ్ల యువకుడు ప్రదీప్‌ మెహ్రా స్ఫూర్తిదాయక

Updated : 22 Mar 2022 01:36 IST

సాయం చేస్తానన్న రిటైర్డ్‌ జనరల్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆర్మీలో చేరాలన్న కల ఉన్నా.. ఆర్థిక స్తోమత కారణంగా శిక్షణ తీసుకోలేక.. నోయిడా వీధుల్లో అర్ధరాత్రి పరిగెడుతూ వెళ్తోన్న 19 ఏళ్ల యువకుడు ప్రదీప్‌ మెహ్రా స్ఫూర్తిదాయక వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. ఈ వీడియోపై తాజాగా ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. ఆ యువకుడి జీవితం ఆత్మనిర్భరతకు ప్రతీక అని కొనియాడారు. 

‘‘ఇది నిజంగా స్ఫూర్తిదాయకం. అయితే అతడి కథ నుంచి నేను పొందిన స్ఫూర్తి ఏంటో తెలుసా?ఆ యువకుడు ఎవరి మీదా ఆధారపడని వ్యక్తి. లిఫ్ట్‌ ఇస్తానన్నా వద్దన్నాడు. అతడికి ఎవరి అవసరం లేదు. అతడు ఆత్మనిర్భరత కలిగిన వ్యక్తి’’ అని మహీంద్రా ట్విటర్‌లో రాసుకొచ్చారు. ఆనంద్‌ మహీంద్రాతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ప్రదీప్‌ మెహ్రాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఆ యువకుడికి శిక్షణ ఇప్పిస్తా..

ఇదిలా ఉండగా ప్రదీప్‌ మెహ్రాకు శిక్షణలో సాయం అందించేందుకు రిటైర్డ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ సతీశ్ దువా ముందుకొచ్చారు. ‘‘అతడిలోని ఆత్మవిశ్వాసం అద్భుతం. అతడు ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో పాసయ్యేలా సాయం చేయాలనుకుంటున్నా. దీని గురించి ఇప్పటికే ఆర్మీ తూర్పు కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ రానా కలితాతో మాట్లాడాను. ఆ యువకుడి రిక్రూట్‌మెంట్‌ కోసం అవసరమైన శిక్షణ అందించడంలో రానా అతడికి సాయం చేస్తారు’ అని వెల్లడించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని