Headaches: గర్భిణికి తలనొప్పా..? వస్తే ఏం చేయాలో తెలుసుకోండి..!

గర్భం వచ్చిన తర్వాత శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. ఆ మార్పులతో చిక్కులు కూడా ఏర్పడుతాయి. మొదటి మూడు నెలల కాలంలో వేవిళ్లు ఇబ్బంది పెడుతాయి. అన్నం తిన్నా వెంటనే వాంతి చేసుకుంటారు. డీ హైడ్రేషన్‌తో కొంతమందికి తలనొప్పి సమస్యగా మారుతుంది.

Published : 10 Aug 2022 01:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గర్భం వచ్చిన తర్వాత శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. ఆ మార్పులతో చిక్కులు కూడా ఏర్పడుతాయి. మొదటి మూడు నెలల కాలంలో వేవిళ్లు ఇబ్బంది పెడుతాయి. అన్నం తిన్నా వెంటనే వాంతి చేసుకుంటారు. డీ హైడ్రేషన్‌తో కొంతమందికి తలనొప్పి సమస్యగా మారుతుంది. కొంతమందికి హార్మోన్లలో వచ్చే మార్పులతో తలనొప్పి బాధిస్తుంది. ఆహార నియమాలలో మార్పులు చేసుకుంటే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఫీటల్‌, మెటర్నల్‌ మెడిసిన్‌ స్పెషలిస్టు డాక్టర్‌ పద్మ పాతూరి వివరించారు.

ఇది సాధారణమేనా..: గర్భిణులకు తలనొప్పి రావడం సాధారణమే అయినా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మొదటి మూడునెలల్లో ఇది కనిపిస్తుంది. నీరసంగా ఉంటుంది. కళ్లు తిరుగుతాయి. ఏదీ తిన్నా వాంతులు అవుతాయి. అందుకే తలనొప్పి వస్తుంది. తలనొప్పే కదాని వదిలేయొద్దు. గర్భం దాల్చడానికి ముందు తలనొప్పి ఉంటే పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదు. చక్కెర శాతం తగ్గినా, రక్తపోటు ఉన్నా కూడా తలనొప్పి రావొచ్చు. గర్భిణులు ఎప్పుడూ కూడా వైద్యులను సంప్రదించకుండా ట్యాబ్లెట్లు వేసుకోవద్దు. కేవలం పారాసిటమాల్‌ మాత్రమే వాడొచ్చు. కొన్నిసార్లు మెదడులో ట్యూమర్‌ ఉన్నపుడు గర్భం దాల్చిన తర్వాత బయటపడొచ్చు. ఇలాంటప్పుడు న్యూరో సర్జన్‌ను కలుసుకోవాలి. 

చికిత్స ఎలా..?: గర్భం వచ్చినపుడు వచ్చే తలనొప్పికి చికిత్స చేసే ముందు గత చరిత్ర తెలుసుకోవాలి. కొవిడ్‌, ఫ్లూ వైరస్‌ దేనితో వచ్చిందో తెలుసుకోవాలి. దాని ఆధారంగా చికిత్స చేయాల్సి ఉంటుంది. బీపీ ఎక్కువగా ఉంటే ఆసుపత్రిలో చేరిన తర్వాతే చికిత్స చేయాల్సి వస్తుంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు