Bilwa Leaves: బిల్వపత్రం..ఆరోగ్యదాయకం.. ఈ ప్రయోజనాలు తెలుసా?

బిల్వ (మారేడు) పత్రం ఎంతో మేలు చేస్తుంది. సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే గుణం ఈ బిల్వపత్రంలో ఉందని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. ఆకులే కాదు,.కాండం, కాయలు, పూలు, వేర్లు కూడా ఆరోగ్యం బాగుండేందుకు సహకరిస్తాయి. వినాయకునికి చేసే పూజలో ఈ పత్రాలు తప్పనిసరిగా ఉండాల్సిందే.

Published : 06 Oct 2022 01:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బిల్వ (మారేడు) పత్రం ఎంతో మేలు చేస్తుంది. సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే గుణం ఈ బిల్వపత్రంలో ఉందని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. ఆకులే కాదు.. కాండం, కాయలు, పూలు, వేర్లు కూడా ఆరోగ్యం బాగుండేందుకు సహకరిస్తాయి. వినాయకునికి చేసే పూజలో ఈ పత్రాలు తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈ చెట్టు ఔషధ గుణాలతో  ఉందని ఆయుర్వేద ఫిజిషియన్‌ పెద్ది రమాదేవి వివరించారు.

ప్రయోజనాలు మెండు

*  మారేడులో మినరల్స్‌, విటమిన్లు అధికంగా ఉంటాయి. కెరోటిన్‌, విటమిన్‌ బి, సి, కాల్షియం, ఫాస్ఫరస్‌, ఐరన్‌ సమృద్ధిగా లభిస్తాయి.

* విరేచనాలు, మలబద్ధకం, జలుబు, ఆయాసం లాంటి సమస్యల నివారణకు బిల్వ ఫలం బాగా ఉపయోగపడుతుంది. 

* ఫైల్స్‌ సమస్య ఉన్నవారు మెంతిపొడితో కలిపి తీసుకోవాలి.

* ఆకులను పొడి చేసి రోజూ కొంచెం తీసుకుంటే మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. 

* వేర్లను చూర్ణం చేసి అర చెంచాడు చొప్పున కాషాయంగా చేసి తీసుకుంటే అనేక రోగాలకు దివ్యౌషధంగా చెబుతారు. దగ్గు, జ్వరం తగ్గించడానికి బాగా పని చేస్తుంది. 

* గర్భిణులకు వచ్చే ఒళ్లు నొప్పుల నివారణకు మారేడు ఆకులను వేడినీటిలో వేసి స్నానం చేయాలి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని