Published : 25 Jun 2022 15:23 IST

Jamun Health Benefits: నేరేడు పండు తింటున్నారా?ప్రయోజనాలివే!

ఇంటర్నెట్‌ డెస్క్‌: అల్ల నేరేడు పండ్లు,ఆకులు, బెరడు ఔషధాల సమాహారం. ఎన్నో వ్యాధులను నయం చేసే ఈ పండ్లు చూసేందుకు నల్లగా నిగనిగలాడుతాయి. తింటే ఒగరు, తీపి, పుల్లగా ఉంటాయి. పండ్లే కాదు ఆకులు, బెరడు కూడా ఎన్నో వ్యాధులను నయం చేయడానికి వినియోగిస్తారు. వేధించే చక్కెర వ్యాధి, గుండె సబంధ జబ్బులు, కాలానుగుణంగా వచ్చే వ్యాధులను అరికట్టడంలో ఎంతో కీలకంగా ఉంటాయి. వీటి ప్రయోజనాలను ఆయుర్వేద ఫిజిషియన్‌ పెద్ది రమాదేవి వివరించారు.

ఇందులో ఎన్ని ప్రయోజనాలో: అధిక మోతాదులో సోడియం., పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్‌, మాంగనీస్‌, జింకు, ఐరన్‌.విటమిన్‌ సి, రెబోప్లోబిన్, నికోటిన్‌, ఆమ్లం,కోలైన్‌, పోలిక్‌ యాసిడ్‌ లాంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఈ పోషకాలు మనలో వ్యాధి నిరోధకతను పెంచుతాయి. రక్త హీనతను తగ్గిస్తాయి. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. గుండె, క్యాన్సర్‌ ముప్పును తగ్గించే గుణం ఉంది. నేరేడు పండు గింజలను ఎండబెట్టుకొని పొడి చేసి రోజూ గ్లాసు నీటిలో కలుపుకొని తాగితే మధుమేహం నియంత్రణలో ఉంటుంది. వాపు కూడా తగ్గిస్తుంది. కొలస్ట్రాల్‌ను కూడా అదుపులో ఉంచుతుంది. మెదడుకు ఔషధంగా పని చేస్తాయి. 


ఇలా చేయండి..ఎలా ఉంటుందో చూడండి

* జ్వరంగా ఉన్నప్పుడు ధనియాల రసంలో నేరేడు రసం కలుపుకొని తాగితే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది.

* మూత్రంలో మంట తగ్గడానికి నిమ్మ, నేరేడు రసం రెండు చెంచాలు నీళ్లలో కలుపుకొని తీసుకోవాలి.

* జీర్ణశక్తిని పెంచడంతో పాటు గ్యాస్‌ లాంటి సమస్యలకు చక్కని పరిష్కారం చూపుతుంది.

* నోటి పూత, చిగుళ్ల వ్యాధులు దంతక్షయం ఉన్నవారు నేరేడు ఆకుల రసాన్ని రోజూ పుక్కిలించినట్లయితే మంచి ఫలితం ఉంటుంది.

* జిగట విరేచనాలతో బాధ పడేవారు రెండు, మూడు చెంచాల నేరేడు పండ్ల రసాన్ని తాగితే విరేచనాలు తగ్గుతాయి. 

* నేరేడు పండ్లలోని యాంటీ అక్సిడెంట్లు కాలేయ పనితీరును మెరుగు పర్చడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. 

* మహిళలకు రుతుస్రావం అధికంగా అయితే నేరేడు గింజల పొడిని కషాయంగా చేసుకొని చెంచాడు తాగితే మంచి ఫలితం ఇస్తుంది.

* ఆకులను ఎండబెట్టి కాల్చి, ఆవు పిడకల మసిలో కలిపి దంతాలను శుభ్రం చేసుకోవచ్చు. పండ్లపై గార, పసుపు, చిగుళ్ల సమస్యలు పోతాయి.


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts