Sexual Life: దాంపత్య శృంగారంతో ప్రయోజనాలెన్నో తెలుసా..?

దాంపత్య జీవితంలో శృంగారానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కుటుంబ బంధం ముడిపడి ఉంటుంది. ఆ ఇద్దరి మధ్యలో శృంగారం దూరమయితే విభేదాలే కాదు..కొన్ని జబ్బులకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. వారానికి కనీసం రెండుసార్లు శృంగారంలో పాల్గొంటే అధిక రక్తపోటు, గుండె జబ్బులు దూరమవుతాయని పేర్కొంటున్నారు.

Published : 26 Sep 2022 02:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దాంపత్య జీవితంలో శృంగారానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కుటుంబ బంధం ముడిపడి ఉంటుంది. ఆ ఇద్దరి మధ్యలో శృంగారం దూరమయితే విభేదాలే కాదు..కొన్ని జబ్బులకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. వారానికి కనీసం రెండుసార్లు శృంగారంలో పాల్గొంటే అధిక రక్తపోటు, గుండె జబ్బులు దూరమవుతాయని పేర్కొంటున్నారు. శృంగారానికి దూరంగా ఉండే దంపతుల్లో అధిక రక్తపోటు పెరుగుతుంది. నిద్ర తీరుతెన్నులూ గాడి తప్పుతాయి. మతిమరుపు కూడా వస్తుంది. 

ఎంత మేలు చేస్తుందంటే..!

* శృంగారం తనువులను ఏకం చేసే క్రీడ. గుండె ఆరోగ్యానికి ఇది మేలు చేస్తుంది. 

*వారానికి రెండు రోజులు కలిస్తే గుండెజబ్బు వచ్చే అవకాశాలు చాలా తక్కువని నిపుణులు పేర్కొంటున్నారు.

* శృంగారానికి దూరంగా ఉండేవారు, నెలకు ఒకసారి పాల్గొనే వారికి ఈ ముప్పు అధికంగా ఉంటుంది. ఇది ఓ వ్యాయామం లాంటిదే. 

* ఆందోళన, కుంగుబాటు తగ్గుతుంది. రక్తపోటు అదుపులో ఉంచే అవకాశం ఉంది. శృంగారంలో పాల్గొంటే నిమిషానికి ఆరు కేలరీలు ఖర్చు అవుతుంది. 

* మగవారిలో ప్రోస్టేట్‌ గ్రంథి ఆరోగ్యంగా ఉంటుంది. నొప్పి, బాధ తగ్గిస్తుంది.

* శృంగారంలో పాల్గొన్నపుడు విడుదలయ్యే ఎండార్పిన్‌,ఆక్సిటోసిన్‌లతో తల,వెన్ను, కాళ్లనొప్పులు తగ్గడానికి కారణమవుతుంది. 

* మెదడు సమర్థంగా పని చేస్తుంది. జ్ఞాపకశక్తిని మెరుగు పరుస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

* మహిళల్లో విడుదలయ్యే ఈస్ట్రోజిన్‌ ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. సుఖనిద్ర పట్టేలా చేస్తుంది. రోగనిరోధకత పెంచుతుంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని