Healthy Teeth: దంతాల ఆరోగ్యాన్ని కాపాడుకోండిలా!

ఆరోగ్యంగా ఉండేందుకు రకరకాల చిట్కాలు పాటిస్తారు. వ్యాయామాలు చేస్తుంటారు. వివిధ రకాల ఆహార పదార్థాలు తింటుంటారు.

Updated : 06 Oct 2022 11:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆరోగ్యంగా ఉండేందుకు రకరకాల చిట్కాలు పాటిస్తారు. వ్యాయామాలు చేస్తుంటారు. వివిధ రకాల ఆహార పదార్థాలు తింటుంటారు. అయితే వీటిని శరీరానికి అందించేది నోరు. మరి నోటి ఆరోగ్యం గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి!

రెండుసార్లు బ్రషింగ్‌..

రోజుకు రెండుసార్లు తప్పనిసరిగా బ్రష్‌ చేయాలి. ఉదయం ఒకసారి, రాత్రి పడుకునే ముందు మరోసారి బ్రష్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి.  ఏదైనా తిన్న తర్వాత నీళ్లతో నోటిని పుక్కిలించాలి. దీంతో పళ్ల మధ్య ఆహారం చాలా వరకూ బయటకు పోతుంది.

ఇవి తీసుకోవడం మానేయండి!

టీ, కాఫీలు ఎక్కువగా తీసుకోవడం వల్ల దంతాల మీద ఉండే ఎనామిల్‌ దెబ్బతింటుంది. మద్యపానం, ధూమపానం, గుట్కాలు నమలడం వల్ల నోటి పూత, నోటి క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ చెడు వ్యసనాలను ఎంత తొందరగా వదిలేసుకుంటే అంత మంచిది.

ఎప్పటి వరకో చూసుకున్నారా!

చాలామంది ఎక్కువ రోజుల పాటు ఒకే టూత్‌ బ్రష్‌ వాడుతుంటారు. ఒక టూత్‌ బ్రష్‌ను 12 వారాలు(3 నెలలు) ఉపయోగించవచ్చు. బ్రష్‌ చేసేటప్పుడు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే వెంటనే టూత్‌బ్రష్‌ మార్చాలి. నాణ్యమైన టూత్‌ బ్రష్‌లు మాత్రమే వాడాలి.

కాల్షియం ఉన్న ఆహారం..

దంతాలు దృఢంగా ఉండేందుకు కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోండి. శరీరానికి హాని కలిగించే ఏ ఆహారాన్ని అయినా సరే పక్కన పెట్టేయండి. ఉదా: ఫాస్ట్ ఫుడ్‌, ఎక్కువ మోతాదులో చాక్లెట్లు తినకూడదు. పౌష్టికాహారాన్ని తీసుకోవాలి.

వైద్యులను సంప్రదించండి..

చిగుళ్ల నుంచి రక్తస్రావం అయినా ఇతరత్రా సమస్యలు ఏర్పడినా దంత వైద్యులను సంప్రదించాలి. 

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని