Chandrababu: చంద్రబాబు ఎస్‌ఎల్‌పీపై సుప్రీంలో విచారణ వాయిదా
తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది.
దిల్లీ: తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu)దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. క్వాష్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు అక్టోబరు 3వ తేదీకి వాయిదా వేసింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఎ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని చంద్రబాబు ఎస్‌ఎల్‌పీ దాఖలు చేశారు. క్వాష్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ గత శుక్రవారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు శనివారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
తొలుత చంద్రబాబు పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టి విముఖత వ్యక్తం చేశారు. దీంతో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను సిద్ధార్థ లూథ్రా సీజేఐ ముందు మళ్లీ మెన్షన్ చేశారు. తక్షణమే లిస్టింగ్ చేయాలని కోరారు. చంద్రబాబు బెయిల్ కోరుకుంటున్నారా? అని ఈ సందర్భంగా సీజేఐ ప్రశ్నించారు. తాము బెయిల్ కోరుకోవడం లేదని లూథ్రా తెలిపారు. ‘‘త్వరగా లిస్ట్ చేయాలన్నది మా మొదటి అభ్యర్థన. మధ్యంతర ఉపశమనం కలిగించాలని రెండో అభ్యర్థన. 17ఏ అనేది కేసు మూలాల నుంచి చర్చించాల్సిన అంశం. ఎఫ్‌ఐఆర్ ప్రకారం చంద్రబాబును కస్టడీలో పెట్టకూడనుటువంటి కేసు ఇది. మేము బెయిల్ కోరుకోవడం లేదు. ట్రయల్ కోర్టు జడ్జిని సంయమనం పాటించాలని చెప్పలేం. జెడ్ కేటగిరీ, ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తిని ఇలా ట్రీట్ చేస్తారా? ఇది పూర్తిగా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయం. యశ్వంత్ సిన్హా కేసులో వ్యక్తి స్వేచ్ఛపై అన్ని విషయాలు పొందుపరిచారు. పోలీసులు కస్టడీ అడుగుతున్నారు. దాని నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నాం’’ అని లూథ్రా పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంవో నుంచి నాకు ఎలాంటి సమాచారం లేదు: దేవులపల్లి ప్రభాకర్‌రావు
తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) నుంచి తనను ఎవరూ సంప్రదించలేదని దేవులపల్లి ప్రభాకర్‌రావు తెలిపారు. -
Revanth Reddy: తెలంగాణ విద్యుత్ రంగంపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
విద్యుత్ రంగంపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతికుమారి, విద్యుత్‌శాఖకు చెందిన ఉన్నతాధికారులతో పాటు ట్రాన్స్‌కో, జెన్కో అధికారులు పాల్గొన్నారు. -
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
KCR: కేసీఆర్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల
భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. -
Revanth Reddy: ‘ప్రజాదర్బార్’ ప్రారంభం.. అర్జీలు స్వీకరించిన సీఎం రేవంత్
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రజాదర్బార్‌ను ప్రారంభించారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని జ్యోతిబాఫూలే ప్రజాభవన్ వద్దకు వచ్చిన ప్రజల నుంచి అర్జీలను ఆయన స్వీకరించారు. -
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు గాయం.. యశోద ఆస్పత్రిలో చికిత్స
భారాస అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆస్పత్రిలో చేరారు. కాలుజారి పడటంతో ఆయనకు గాయమైంది. -
ఉత్తరాంధ్ర దోపిడీ.. వైకాపా నేతలకు కనిపించలేదా!!
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/12/2023)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.


తాజా వార్తలు (Latest News)
-
Revanth Reddy: అంతకుమించిన తృప్తి ఏముంటుంది!: సీఎం రేవంత్ ఆసక్తికర ట్వీట్
-
UPI: ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఆటో డెబిట్, ఆ యూపీఐ చెల్లింపుల పరిమితి పెంపు
-
Fake Toll Plaza: రోడ్డు వేసి.. నకిలీ టోల్ ప్లాజా కట్టి.. ₹కోట్లు కొట్టేసి: గుజరాత్లో ఘరానా మోసం
-
Flipkart: ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్
-
ChandraBabu: ప్రతిపక్షాల ఓట్లను అధికార పార్టీ తొలగిస్తోంది: ఈసీకి చంద్రబాబు లేఖ
-
Revanth Reddy: దిల్లీ వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి