Chandrababu: క్వాష్‌ పిటిషన్‌పై విచారణ ప్రారంభం.. వాదనలు వినిపిస్తున్న హరీశ్‌సాల్వే

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. జ్యుడీషియల్‌ రిమాండ్‌ ఉత్తర్వులను కొట్టివేయాలని పిటిషన్‌లో చంద్రబాబు కోరిన విషయం తెలిసిందే.

Updated : 19 Sep 2023 12:56 IST

అమరావతి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. జ్యుడీషియల్‌ రిమాండ్‌ ఉత్తర్వులను కొట్టివేయాలని పిటిషన్‌లో చంద్రబాబు కోరిన విషయం తెలిసిందే. ఆయన తరఫున సీనియర్‌ న్యాయవాది హరీశ్‌సాల్వే వర్చువల్‌గా వాదనలు వినిపిస్తున్నారు. పీసీ యాక్ట్‌ 17ఏపై తన వాదనలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల నేపథ్యంలో దురుద్దేశంతోనే చంద్రబాబుపై కేసు నమోదు చేశారన్నారు.

ఈ కేసులో చంద్రబాబును చట్టవిరుద్ధంగా అరెస్ట్‌ చేశారంటూ గతంలో ఆయన తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. దీంతో ఈనెల 18 వరకు కౌంటర్‌ దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సమయం ఇచ్చింది. ఆ గడువు పూర్తయిన నేపథ్యంలో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది. 

ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసుపై విచారణ వాయిదా

సీఐడీ నమోదు చేసిన అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పైనా హైకోర్టులో విచారణ జరిగింది. ఉన్నత న్యాయస్థానం తదుపరి విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది.  

మరోవైపు ఏసీబీ కోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌, మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పైనా విచారణ జరగనుంది. సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్‌పైనా వాదనలు జరిగే అవకాశముంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు