Chandrababu Arrest: చంద్రబాబు బెయిల్‌, కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా

నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో బెయిలు కోసం తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది.

Updated : 27 Sep 2023 18:52 IST

విజయవాడ: నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో బెయిలు కోసం తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ అక్టోబరు 4వ తేదీకి వాయిదా పడింది. ఇదే కేసులో చంద్రబాబును మరో అయిదు రోజులు పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీఐడీ దాఖలుచేసిన పిటిషన్‌పై కూడా విచారణ అక్టోబరు 4కు వాయిదా వేస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. రెండు పిటిషన్లపై ఒకే సారి వాదనలు వింటామని న్యాయమూర్తి తెలిపారు. వాదనలు విన్న తర్వాత ఒకేసారి ఉత్తర్వులు ఇస్తామని పేర్కొన్నారు. అమరావతి రింగురోడ్డు, ఫైబర్‌ నెట్‌ కేసుల్లో పీటీ వారెంట్లపై విచారణను కూడా విజయవాడ ఏసీబీ కోర్టు అక్టోబరు నాలుగో తేదీకి వాయిదా వేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని