Hyderabad: జగన్‌ అక్రమాస్తుల కేసు.. 127 డిశ్చార్జ్‌ పిటిషన్లపై కొలిక్కి వచ్చిన వాదనలు

ఏపీ సీఎం జగన్‌ అక్రమాస్తుల కేసులో డిశ్చార్జ్‌ పిటిషన్లపై నాంపల్లి సీబీఐ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది.

Published : 01 Dec 2023 19:05 IST

హైదరాబాద్‌: ఏపీ సీఎం జగన్‌ అక్రమాస్తుల కేసులో నాంపల్లి సీబీఐ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. నిందితులకు సంబంధించిన 127 డిశ్చార్జ్‌ పిటిషన్లపై వాదనలు కొలిక్కి వచ్చాయి. 11 సీబీఐ, 8 ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్లలో నిందితుల పిటిషన్లపై విచారణ కొలిక్కి వచ్చింది. లిఖితపూర్వక వాదనలు ఉంటే ఇవ్వాలని సీబీఐ, ఈడీ, నిందితులకు సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను న్యాయస్థానం డిసెంబర్‌ 15కు వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని