Children Health: చిన్న పిల్లల్లో వినికిడి సమస్యలా!

చిన్న పిల్లలు ఎటువంటి శబ్దానికైనా స్సందిస్తారు. ఏదైనా చిన్న వయసులో ఉన్నపుడు వారికి గ్రహించే శక్తి అధికంగా ఉంటుందట!

Published : 10 May 2022 02:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చిన్న పిల్లలు ఎటువంటి శబ్దానికైనా స్పందిస్తారు. ఏదైనా చిన్న వయసులో ఉన్నపుడు వారికి గ్రహించే శక్తి అధికంగా ఉంటుందట! అయితే కొంతమంది పిల్లల్లో మాత్రం ఎటువంటి స్పందనా ఉండదు. పిల్లల్లో వినికిడి లోపం ఉంటే అశ్రద్ధ చేయకూడదు. వెంటనే వైద్యులను సంప్రదించాలి. లేదంటే వాళ్లు వినికిడితో పాటు మాట్లాడటం కూడా కష్టతరంగా మారి మూగ, చెవిటి వారిగా మారిపోయే ప్రమాదం ఉంది.

ఎలా గుర్తించాలి

ఇంట్లో ఏదైనా కిందపడినా, పెద్ద పెద్ద శబ్దాలు వచ్చినా తల తిప్పి చూడక పోవటం. వారికి అసలు ఏమైందో తెలియకపోవడం వంటి వాటి ద్వారా తెలుసుకోవచ్చు. కొంతమంది పుట్టుకతో వినికిడి లోపంతో పుడతారు. న్యూయొనోటల్‌ హియరింగ్‌ స్ర్కీనింగ్‌ టెస్ట్‌ చేయడం ద్వారా వినికిడి లోపం ఉందో లేదో తెలుసుకునే అవకాశం ఉంటుంది. పిల్లలకు చెవుడు తల్లి గర్భంలో ఉన్నపుడు ఆమె వాడిన మందుల వల్ల రావచ్చు. అతి తక్కువగా బరువు ఉన్న పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.

సాధారణంగా పిల్లలు మూడు నెలల వయసులో శబ్దం వింటే కాళ్లు చేతులు కదిలిస్తారు. ఆరు నెలల వయసు వచ్చేసరికి శబ్దం వచ్చిన వైపు తిరుగుతారు. ఏడు ఎనిమిది నెలలు వచ్చేసరికి శబ్దం ఎటునుంచి వస్తుందనేది గుర్తిస్తారు. యేడాదిన్నర వయసు ఉన్న పిల్లలు మనం అడిగే ప్రశ్నలను విని వాటికి సమాధానాలు చెబుతారు. ఇలా స్పందించకపోతే తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించాలి. పిల్లలు చిన్న వయసులో ఉన్నపుడు ఈ సమస్య ఉందా లేదా అనేది గుర్తించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. సమస్య గుర్తించి ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను ఉపయోగించుకోవాలి. తద్వారా పిల్లలు భవిష్యత్తులో వినికిడి, మాట్లాడటం కోల్పోకుండా ఉంటారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని