AP High Court: పీఆర్సీపై దాఖలైన పిటిషన్‌.. హైకోర్టులో విచారణ ప్రారంభం

ఏపీ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పీఆర్సీ జీవోలను సవాలు చేస్తూ

Updated : 24 Jan 2022 15:30 IST

అమరావతి: ఏపీ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పీఆర్సీ జీవోలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. పీఆర్సీ నివేదికను బహిర్గతం చేయలేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది రవితేజ కోర్టుకు తెలిపారు. నోటీసు లేకుండా జీతాల్లో కోత విధించడం చట్ట విరుద్ధమన్నారు. హెచ్‌ఆర్‌ఏ విభజన చట్టప్రకారం జరగలేదని ఉన్నత న్యాయస్థానానికి వివరించారు.

ఈ క్రమంలో కోర్టు ఎదుట హాజరుకావాలని పిటిషనర్‌తో పాటు 12 సంఘాల నేతలను ధర్మాసనం ఆదేశించింది. అనంతరం విచారణను మధ్యాహ్నం 2.15 గంటలకు హైకోర్టు వాయిదా వేసింది. ఏపీ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ ఐకాస అధ్యక్షుడు కృష్ణయ్య పీఆర్సీని సవాలు చేస్తూ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు