Parthasarathy: ఎమ్మెల్యే పార్థసారథికి గుండెపోటు

పెనమలూరు వైకాపా ఎమ్మెల్యే  పార్థసారథికి గుండెపోటు వచ్చింది. యాంజియోగ్రామ్‌ చేసిన వైద్యులు ఆయనకు స్టెంట్‌ వేశారు.

Updated : 10 Jun 2023 16:45 IST

పెనమలూరు: కృష్ణా జిల్లా పెనమలూరు వైకాపా ఎమ్మెల్యే పార్థసారథి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను విజయవాడలోని టాప్‌స్టార్స్‌ ఆస్పత్రిలో చేర్చారు. పరీక్షించిన వైద్యులు ఆయనకు గుండెపోటు వచ్చినట్లు నిర్ధరించారు. యాంజియోగ్రామ్‌ చేసి స్టెంట్‌ వేసినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని టాప్‌స్టార్స్‌ ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు