కిటలాడుతున్న ప్రయాణ ప్రాంగణాలు

సంక్రాంతి పండగకు ప్రయాణికులు సొంతూళ్లకు పయనమవుతున్నారు.దీంతో ప్రయాణ ప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి.

Updated : 10 Jan 2021 21:52 IST

విజయవాడ: సంక్రాంతి పండగకు ప్రయాణికులు సొంతూళ్లకు పయనమవుతున్నారు.దీంతో ప్రయాణ ప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి. విజయవాడ బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ నెలకొంది. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాలకు ఏపీఎస్‌ ఆర్టీసీ 3,607 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఈ సర్వీసులు ఈ నెల 13 వరకు నడవనున్నాయి. పండగ నేపథ్యంలో హైదరాబాద్‌-విజయవాడ, విశాఖ సహా పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు కూడా నడుస్తున్నాయి. ఈ సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్‌ సదుపాయం కల్పించారు.

ఇదీ చదవండి..
అందరి సహకారంతో ఎన్నికలు:ఏపీ ఎస్‌ఈసీ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని