
పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద
గుంటూరు: పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరుతోంది. ఎగువ నుంచి పులిచింతలకు 3.41లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా.. 16 గేట్ల ద్వారా అంతే మొత్తాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 38 టీఎంసీలుగా ఉంది.విజయవాడ ప్రకాశం బ్యారేజీకి ఎగువ నుంచి 2.18లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. దీంతో అన్ని గేట్లు ఎత్తి 2.77లక్షల క్యూసెక్కుల వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీలో 2.8 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.