Vizag: నిఘా నీడలో విశాఖ నగరం.. వేలాది మంది పోలీసులతో బందోబస్తు

ప్రధాని నరేంద్రమోదీ రెండు రోజుల పర్యటన కోసం విశాఖ నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. వేలాది మంది పోలీసులతో బందోబస్తు కల్పించారు.

Updated : 11 Nov 2022 20:41 IST

విశాఖపట్నం: ప్రధాని నరేంద్రమోదీ రెండు రోజుల పర్యటన కోసం విశాఖ నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. వేలాది మంది పోలీసులతో బందోబస్తు కల్పించారు. ఇవాళ సాయంత్రం భాజపా చేపట్టనున్న శోభాయాత్ర ర్యాలీలో ప్రధాని పాల్గొననున్నారు. ‘ఐఎన్‌ఎస్‌ డే’గా ఎయిర్‌బేస్‌ నుంచి మొత్తం 3 కిలోమీటర్ల మేర ఇరువైపులా ప్రజలకు అభివాదం చేస్తూ తూర్పు నౌకాదళ స్థావరంలోని ఐఎన్‌ఎస్‌ చోళా వరకు ర్యాలీ జరగనుంది. రాత్రి 8గంటల తర్వాత భాజపా నేతలతో, అనంతరం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తోనూ ప్రధాని వేర్వేరుగా భేటీ కానున్నారు. శనివారం ఉదయం ఆంధ్రవిశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో రూ.15,233 కోట్ల విలువైన 9 ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను ప్రధాని మోదీ చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో పాటు ముఖ్యమంత్రి జగన్ హాజరు కానున్నారు. 

ప్రధాని పాల్గొనే బహిరంగసభ వేదికపైకి 8మందికే అనుమతి

ప్రధాని పాల్గొనే బహిరంగ సభ వేదికపైకి 8మందికే అనుమతి లభించింది. ప్రధాని వేదికపై గవర్నర్‌, సీఎం, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌, ఎమ్మెల్సీ మాధవ్‌, వాకాటి, జీవీఎల్‌ నరసింహరావు, సీఎం రమేశ్‌, విశాఖ ఎంపీకి అనుమతి లభించింది. ఈ సమావేశంలో మాట్లాడేందుకు సీఎం జగన్‌కు 7 నిమిషాల సమయం ఇచ్చారు. విశాఖ సభలో ప్రధాని మోదీ దాదాపు 40 నిమిషాలు ప్రసంగించనున్నారు. బహిరంగ సభకు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ అధ్యక్షత వహించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని