IMD: దక్షిణ కోస్తాంధ్రకు తుపాను ముప్పు.. అప్రమత్తమైన రెవెన్యూ యంత్రాంగం
ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి మరింత బలపడినట్టు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఈ సాయంత్రానికి ఇది క్రమంగా వాయుగుండంగా మారే సూచనలు ఉన్నట్టు వెల్లడించింది.
అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి మరింత బలపడినట్టు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఈ సాయంత్రానికి ఇది క్రమంగా వాయుగుండంగా మారే సూచనలు ఉన్నట్టు వెల్లడించింది. వాయువ్య దిశగా కదులుతూ కోస్తాంధ్ర-తమిళనాడు తీరానికి దగ్గరగా వస్తూ మరింత బలపడి 8వ తేదీ ఉదయానికి తుపానుగా మరే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. దక్షిణ కోస్తాంధ్ర-తమిళనాడు తీరాలకు దగ్గరగా తుపానుగా మారిన అనంతరం తీవ్ర ప్రభావం చూపే సూచనలు ఉన్నట్టు స్పష్టం చేసింది.
వాయుగుండం ప్రభావంతో 7వ తేదీ సాయంత్రం నుంచి తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు, రాయలసీమల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. అలాగే 8 నుంచి 10వ తేదీ వరకు దక్షిణ కోస్తా, తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ప్రత్యేకించి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు తిరుపతి, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలకు ఆస్కారమున్నట్టు ఐఎండీ వెల్లడించింది. 7 నుంచి 10వ తేదీ వరకు మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు తీర ప్రాంతాల్లోని రెవెన్యూ యంత్రాంగాన్ని ఏపీ విపత్తు నిర్వహణసంస్థ అప్రమత్తం చేసింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
K Viswanath: విశ్వనాథ వారి కలం.. అవార్డులు వరించిన ఈ ఐదు చిత్రాలు ఎంతో ప్రత్యేకం..!
-
Politics News
Somu Veerraju: కలసి వస్తే జనసేనతో.. లేకుంటే ఒంటరిగానే పోటీ: సోము వీర్రాజు
-
World News
China: అమెరికా ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టాలనుకుంటోంది
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
Kotamreddy: కాసేపట్లో మళ్లీ మీడియా ముందుకు కోటంరెడ్డి
-
Crime News
కారులో మంటలు.. గర్భిణి, భర్త సజీవదహనం