Heavy rain: హైదరాబాద్‌లో భారీ వర్షం.. మరో మూడురోజులు వానలే

నగరంలో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

Published : 21 Jun 2024 15:35 IST

హైదరాబాద్‌: నగరంలో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పాతబస్తీ, రాయదుర్గం, మాదాపూర్‌, గచ్చిబౌలి, కొత్తపేట, సరూర్‌నగర్‌, చంపాపేట్‌, సైదాబాద్‌, మాదన్నపేట్‌, మలక్‌పేట్‌, చాదర్‌ఘాట్‌, ఎల్బీనగర్‌ తదితర ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం వర్షం కురిసింది. 

రాష్ర్టంలో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు పడతాయని వెల్లడించింది. శనివారం భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఆదిలాబాద్‌, కొమురం భీం, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని