Hyderabad: హైదరాబాద్‌ వాసులపై వరుణుడి ప్రతాపం.. వరుసగా మూడో రోజు భారీ వర్షం

భాగ్యనగర వాసులపై వరుణుడి ప్రతాపం వరుసగా మూడో రోజు కూడా కొనసాగింది. హైదరాబాద్‌లోని....

Updated : 28 Sep 2022 19:24 IST

హైదరాబాద్‌: భాగ్యనగర వాసులపై వరుణుడి ప్రతాపం వరుసగా మూడో రోజు కూడా కొనసాగింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సరూర్‌నగర్‌, చంపాపేట్‌, సైదాబాద్‌, ఎల్బీనగర్‌, మన్సూరాబాద్‌, నాగోలు, వనస్థలిపురం, హయత్‌నగర్‌, పెద్దఅంబర్‌పేట తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఏకధాటిగా కురిసిన వర్షానికి వరదనీరు రోడ్లపైకి చేరడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని