Hyderabad: జంటనగరాల్లో భారీ వర్షం.. స్తంభించిన జనజీవనం

జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఇవాళ ఉదయం నుంచి కురుస్తోన్న వర్షానికి జనజీవనం స్తంభించింది. నగరంలోని చందానగర్‌, మల్కాజిగిరి, కీసర, పంజాగుట్ట, అంబర్‌పేట, కాచిగూడ,

Updated : 06 Oct 2022 17:04 IST

హైదరాబాద్‌: జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఇవాళ ఉదయం నుంచి కురుస్తోన్న వర్షానికి జనజీవనం  స్తంభించింది. నగరంలోని చందానగర్‌, మల్కాజిగిరి, కీసర, పంజాగుట్ట, అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ముషీరాబాద్‌, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌, బాగ్‌లింగంపల్లి, బోలక్‌పూర్‌, కవాడిగూడ, జవహర్‌నగర్‌, రాంనగర్‌, దోమలగూడ, కాటేదాన్‌, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, మారేడుపల్లిలో మోస్తరు వర్షం కురిసింది. బేగంపేట, ఆల్వాల్‌, చిలకలగూడ, గాంధీనగర్‌, రాజేంద్రనగర్‌, శివరాంపల్లి, కిస్మత్‌పూర్, శంషాబాద్‌, మణికొండ, గండిపేట్‌, ఆరాంఘర్‌, బండ్లగూడ, నార్సింగిలో కురిసిన వర్షానికి నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి కురుస్తోన్న వర్షానికి నగరంలోని పలు ప్రాంతాల్లోని రోడ్లు పూర్తిగా జలమయమై చెరువులను తలపిస్తున్నాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని