Rain in Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి వరుణుడి ప్రతాపం..

కొన్ని రోజులుగా హైదరాబాద్‌ నగరాన్ని వరుణుడు వదలట్లేదు. సోమవారం మరోసారి తన ప్రతాపాన్ని చూపించాడు. దీంతో నగరంలోని పలుచోట్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Published : 10 Oct 2022 16:23 IST

హైదరాబాద్‌: భాగ్యనగర వాసులపై వరుణుడు మరోసారి ప్రతాపం చూపించాడు. ఉదయం నుంచి అక్కడక్కడ చిన్నపాటి చినుకులు పడుతూ మధ్యాహ్నం ఒక్కసారిగా భారీ వర్షంగా మారింది. దీంతో అవసరం రీత్యా బయటికి వచ్చిన నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కోఠి, బేగంబజార్, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్, హైదర్‌గూడ, నారాయణగూడ, లక్డీకాపూల్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌, ముషీరాబాద్‌, చిక్కడపల్లి, బాగ్‌లింగంపల్లి, రామ్‌నగర్‌, దోమలగూడ, బోలక్‌పూర్‌, కవాడిగూడ, గాంధీనగర్, జవహర్‌నగర్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, ఎస్‌ఆర్‌నగర్, సనత్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వరదనీరు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని