Rain: హైదరాబాద్‌లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

నగరంలోని వివిధ ప్రాంతాల్లో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.

Published : 13 Jun 2024 15:43 IST

హైదరాబాద్‌: నగరంలోని వివిధ ప్రాంతాల్లో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. హయత్‌నగర్‌, వనస్థలిపురం, ఎల్బీనగర్‌, నాగోలు, చైతన్యపురి, గడ్డిఅన్నారం, దిల్‌సుఖ్‌నగర్‌, మలక్‌పేట్ తదితర ప్రాంతాల్లో భారీవర్షం కురవడంతో రహదారులపైకి వరదనీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని