Tirupati: తిరుపతిలో వర్ష బీభత్సం.. స్తంభించిన జనజీవనం

తిరుపతిలో గురువారం సాయంత్రం భారీ వర్షం బీభత్సం సృష్టించింది. 

Updated : 25 May 2023 22:38 IST

తిరుపతి: తిరుపతిలో గురువారం సాయంత్రం భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షంతో జనజీవనం స్తంభించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో చెట్లు పడిపోయాయి. దేవేంద్ర థియేటర్‌, లీలా మహల్‌ కూడలి, తితిదే పరిపాలనా భవనం తదితర ప్రాంతాల్లో చెట్లు విరిగిపడి, వరదనీరు నిలిచిపోయి వాహనదారులు ఇబ్బంది పడ్డారు. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతా ల్లోకి నీరు చేరి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

బాపట్ల జిల్లాలో..

బాపట్ల జిల్లాలోని చీరాల, పరుచూరు, వేటపాలెం, చిన గంజాం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. పెనుగాలులకు చీరాల-వేటపాలెం రోడ్డులోని దేవంగపురి వద్ద తాటిచెట్టు విరిగి రహదారిపై పడింది. రామకృష్ణాపురం ప్రాంతంలో చెట్టుకొమ్మలు విరిగిపడి విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. చీరాల పట్టణంలోనూ కాసేపు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

గుంటూరులో...

గుంటూరులో 20 నిమిషాల పాటు గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి చంద్రమౌళి నగర్‌, నెహ్రూ నగర్‌, మణిపురం ప్రాంతాల్లో రహదారికి అడ్డంగా చెట్లు విరిగిపడటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. వెంటనే స్పందించిన నగరపాలక సంస్థ సిబ్బంది చెట్ల కొమ్మలు నరికి ఇబ్బందుల్లేకుండా చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో హోర్డింగ్‌లు కూడా దెబ్బతిన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు