Yadadri: తడిసి ముద్దయిన యాదగిరిగుట్ట.. క్యూ కాంప్లెక్స్‌లోకి వర్షపునీరు

భారీ వర్షానికి యాదగిరిగుట్ట తడిసిముద్దయింది. బుధవారం తెల్లవారుజామున 5 గంటల నుంచి సుమారు రెండు గంటపాటు ఏకధాటికి వర్షం కురిసింది.

Updated : 04 May 2022 15:37 IST

యాదగిరిగుట్ట: భారీ వర్షానికి యాదగిరిగుట్ట తడిసిముద్దయింది. బుధవారం తెల్లవారుజామున 5 గంటల నుంచి సుమారు రెండు గంటపాటు ఏకధాటికి వర్షం కురిసింది. శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయం పరిసరాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోకి వరదనీరు చేరింది. యాదగిరిగుట్ట కొండ పైనుంచి కిందికి నూతనంగా నిర్మించిన మార్గం ప్రారంభంలో తారు రోడ్డు కుంగిపోయింది. కొండపై క్యూకాంప్లెక్స్‌లోకి కూడా వర్షపు నీరు చేరింది. యాదగిరిగుట్ట బస్టాండ్‌ ప్రాంగణం వరదనీటితో నిండిపోయింది. భారీ వర్షం ధాటికి కొండపై నుంచి వర్షపునీరు దిగువన ఉన్న కాలనీలోకి వచ్చి చేరింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని