Heavy rain: హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. బలమైన గాలుల ధాటికి కొన్ని చోట్ల చెట్లు విరిగిపడ్డాయి.

Updated : 17 Jun 2024 18:18 IST

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. బలమైన గాలుల ధాటికి కొన్ని చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. గచ్చిబౌలి, మాదాపూర్‌, రాయదుర్గం, షేక్‌పేట, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, లక్డీకపూల్‌, అమీర్‌పేట, రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, కిస్మత్‌పురా, ఎస్సార్‌నగర్‌, ఎర్రగడ్డ, యూసఫ్‌గూడ, లంగర్‌హౌస్‌, గండిపేట్‌, శివరాంపల్లి, ఎల్బీనగర్, మన్సూరాబాద్, నాగోల్, బీఎన్‌రెడ్డినగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్‌మెట్‌ ప్రాంతాల్లో జోరుగా వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జీహెచ్‌ఎంసీ విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి.

ఈదురుగాలుల కారణంగా టోలిచౌకీ- గోల్కొండ ఎండీ లైన్స్‌లో 200 ఏళ్ల నాటి వృక్షం నేలకూలింది. ఈ ఘటనలో ఒక వ్యక్తికి గాయాలు కాగా.. నాలుగు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు