
Memes: ఆఫీస్‌కు ఈదుకుంటూనే వెళ్లాలి.. చెన్నై వర్షపాతంపై మీమ్స్ చూశారా?
చెన్నై: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడులోని చెన్నై నగరం, దాని శివారు జిల్లాల్లో కొద్దిరోజులుగా కుండపోత వర్షం కురుస్తోంది. 2015 తర్వాత ఆ స్థాయిని గుర్తుకు తెచ్చేలా కురిసిన వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూర్ జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సోమ, మంగళవారాలు సెలవు ప్రకటించారు. తమిళనాడులో అక్టోబరు ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు సాధారణంకంటే 43 శాతం అధికంగా వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆదివారం చెన్నైలో దాదాపు 20 సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది. ఇంకా వర్షాలు కురుస్తుంటడంతో అనేక ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే నిన్నటినుంచి ట్విటర్లో #ChennaiRain ట్రెండింగ్‌లో ఉంది. మీమర్లు సైతం అనేక మీమ్‌లు సృష్టిస్తున్నారు. ఆఫీస్‌కు ఈదుకుంటూ వెళ్లడం ఒక్కటే మార్గం, మా వీధిలో నది.. మా ఇంట్లో సరస్సు లాంటి మీమ్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.