Updated : 04 May 2022 10:47 IST

Heavy Rain: హైదరాబాద్‌లో ఈదురు గాలులతో భారీ వర్షం.. పలుచోట్ల పవర్‌ కట్‌

హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్‌, అమీర్‌పేట, పంజాగుట్ట, సికింద్రాబాద్‌, మారేడ్‌పల్లి, చిలకలగూడ, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, మియాపూర్‌, నిజాంపేట్‌, ప్రగతినగర్‌, రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, కిస్మత్‌పూర్‌, అల్వాల్‌, బేగంపేట్‌, సైదాబాద్‌, చంపాపేట, సరూర్‌నగర్‌, కొత్తపేట, ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, నాగోల్‌, చైతన్యపురి, వనస్థలిపురం, హయత్ నగర్, తుర్కయంజాల్, పెద్ద అంబర్‌పేట్‌, అబ్దుల్లాపుర్‌మెట్‌, బుద్వేల్‌, శివరాంపల్లి, కుషాయిగూడ, ఈసీఐఎల్‌, కాప్రా, జగద్గిరిగుట్ట, కూకట్‌పల్లి, కంటోన్మెంట్‌, మల్కాజిగిరి, ముషీరాబాద్‌ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. దీంతో నగరంలోని రోడ్లపై వరద పొంగిపొర్లుతోంది. పలు కాలనీలు జలమయమయ్యాయి. 

విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో హైదరాబాద్‌ నగర పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. జూబ్లీహిల్స్‌,యూసుఫ్‌గూడ, అమీర్‌పేట, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి, కొత్తపేట, ఎల్బీనగర్‌, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో పవర్‌ కట్‌ అయింది. పంజాగుట్ట కూడలి వద్ద భారీగా వర్షపు నీరు నిలిచింది. ఖైరతాబాద్‌, బంజారాహిల్స్‌ కూడలి వద్ద మోకాళ్ల లోతులో నీరు చేరింది. యూసుఫ్‌ గూడ నుంచి మైత్రీవనం వెళ్లే మార్గంలో స్టేట్ హోమ్ వద్ద రోడ్డుపై చెట్టుకొమ్మలు విరిగిపడ్డాయి. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఎల్బీనగర్‌ వద్ద రోడ్డుపై ఏర్పడిన గుంతలో ఓ కారు ఇరుక్కుపోయింది. దాన్ని బయటకు తీసేందుకు జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది యత్నిస్తున్నారు. ఎల్బీనగర్‌ ఫ్లై ఓవర్‌ వద్ద భారీగా వరదనీరు నిలిచిపోవడంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఓ ఆర్టీసీ బస్సు వరదనీటిలో చిక్కుకుంది. 

హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షం కురుస్తోంది. నల్గొండ, భువనగిరి, మిర్యాలగూడ తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ఈ వర్షంతో గత కొన్నిరోజులుగా ఎండవేడిమితో అల్లాడుతున్న ప్రజలకు ఒక్కసారిగా ఉపశమనం లభించినట్లైంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. నేడు, రేపు కూడా వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ఇప్పటికే వెల్లడించింది.


హైదరాబాద్‌ సిటీలో వర్షపాతం వివరాలు..

తెలంగాణలో ఇతర జిల్లాల్లో వర్షపాతం ఇలా..


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని