శ్రీవారి దర్శనానికి రెండ్రోజుల సమయం.. 21 వరకు బ్రేక్‌ దర్శనాలు రద్దు: తితిదే

తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. దీంతో ఈనెల 21 వరకు బ్రేక్‌ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు...

Published : 13 Aug 2022 22:14 IST

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. దీంతో ఈనెల 21 వరకు బ్రేక్‌ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. వారాంతంలో వరుస సెలవులు రావడంతో తిరుమలలో అనూహ్యమైన రద్దీ నెలకొందని, సామాన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 21వరకు  సిఫారసు లేఖలపై బ్రేక్‌ దర్శనాలు రద్దు చేశామని ఛైర్మన్‌ తెలిపారు. వరుస సెలవుల దృష్ట్యా ఈనెల 20 వరకు భక్తుల రద్దీ ఉంటుందని భావిస్తున్నట్టు చెప్పారు. వీఐపీ బ్రేక్‌, పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, ప్రత్యేక దర్శనాలను కూడా రద్దు చేసినట్టు వెల్లడించారు.

శనివారం రాత్రి సర్వదర్శనం భక్తుల క్యూలైన్‌ కంపార్ట్‌మెంట్లు దాటిపోయి అక్టోపస్‌  భవనం సమీపంలోని ఔటర్‌ రింగ్‌రోడ్డు వరకు చేరుకుంది. దీంతో శ్రీవారి దర్శనానికి రెండు రోజుల సమయం పడుతోంది. రాత్రి 8గంటల వరకు 56,546 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. యాత్రీకుల రద్దీ భారీగా పెరిగిన నేపథ్యంలో తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలని భక్తులకు తితిదే మరోసారి విజ్ఞప్తి చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని