Tirumala: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. 6కి.మీ మేర భక్తుల బారులు!

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గత ఐదు రోజులుగా వరుస సెలవులు, వివాహాల నేపథ్యంలో భక్తులు తిరుమలకు అధికంగా

Updated : 14 Aug 2022 15:59 IST

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గత ఐదు రోజులుగా వరుస సెలవులు, వివాహాల నేపథ్యంలో భక్తులు తిరుమలకు అధికంగా తరలివస్తున్నారు. శనివారం రాత్రి నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ఆరు కిలోమీటర్లకు పైగా క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, నారాయణగిరి షెడ్లు, క్యూలైన్లు సేవాసదన్‌ దాటి రింగ్‌రోడ్డుకు వరకు భక్తుల క్యూ చేరుకుంది.

మరోవైపు శ్రీవారి దర్శనానికి 48 గంటలకు పైగా సమయం పడుతోందని తితిదే ప్రకటించింది. భక్తులు రద్దీకి అనుగుణంగా తమ ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోవాలని.. లేదంటే వాయిదా వేసుకోవాలని తితిదే అధికారులు సూచించారు. శనివారం 83,422 మంది శ్రీవారిని దర్శించుకున్నట్లు తితిదే తెలిపింది.

  

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని