Raj Bhavan: తెలంగాణ రాజ్‌భవన్‌ వద్ద భారీగా పోలీసుల మోహరింపు

తెలంగాణ రాజ్‌భవన్‌ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతాంగ సమస్యల పరిష్కారం, అటవీ సంరక్షణ నియమాలు-2022 ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో చలో రాజ్‌భవన్‌కు పిలుపునిచ్చారు.

Published : 26 Nov 2022 11:30 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాజ్‌భవన్‌ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతుల సమస్యల పరిష్కారం, అటవీ సంరక్షణ నియమాలు-2022 ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో చలో రాజ్‌భవన్‌కు పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా తెలంగాణలో సంయుక్త కిసాన్‌ మోర్చా, ఆదివాసి అటవీ హక్కుల సంరక్షణ సమన్వయ కమిటీలు ఇవాళ చలో రాజ్‌భవన్‌కు పిలుపునిచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు రాజ్‌భవన్‌ వద్ద భారీగా మోహరించారు. ఖైరతాబాద్‌ కూడలి నుంచి రాజ్‌భవన్‌ వరకు బారికేడ్లు ఏర్పాటు చేశారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని