Tirumala: శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు.. అలిపిరి వద్ద వాహనాల బారులు

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద 

Updated : 19 Mar 2022 14:14 IST

తిరుపతి: కరోనా పరిస్థితులు తగ్గుముఖం పడుతుండటంతో తిరుమలలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఇవాళ భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాలు బారులుదీరాయి. తనిఖీలకు సమయం పడుతుండటంతో గంటల తరబడి భక్తులు వాహనాల్లోనే వేచి చూడాల్సి వస్తోంది. భక్తులు అధిక సంఖ్యలో సొంత వాహనాల్లో వస్తుండటం, వాటన్నింటినీ తనిఖీలు చేయడానికి ఆలస్యమవుతుండటంతో రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. దీంతో తిరుమలకు వెళ్లే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.

మరోవైపు తిరుమలకు చేరుకున్న యాత్రికులకు అద్దె గదుల కొరత నెలకొంది. రద్దీకి సరిపడా గదులు లేకపోవడంతో కేంద్రాల వద్ద వేచి ఉండాల్సి వస్తోందని భక్తులు వాపోతున్నారు. నిన్న 66,763 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. 33, 133 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. రూ.4.29 కోట్ల హుండీ ద్వారా ఆదాయం వచ్చినట్లు తితిదే ప్రకటించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు