Karnataka: బస్సులో.. కోడిపిల్లకు టికెట్‌!

బస్సులో భారీ వస్తువులను తీసుకెళ్తే.. అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని మనకు తెలుసు.

Published : 03 Jan 2022 01:18 IST

బెంగళూరు: బస్సులో భారీ వస్తువులను తీసుకెళ్తే.. అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని మనకు తెలుసు. కానీ ఓ బుల్లి కోడి పిల్లకు హాఫ్ టికెట్ తీసుకున్న వింత ఘటన కర్ణాటకలో జరిగింది. సిద్ధపుర నుంచి ఓ సంచార కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు.. రూ.10 చెల్లించి కోడి పిల్లను కొనుగోలు చేశారు. దాన్ని తీసుకుని హోసనగర వద్ద కేయస్ఆర్టీసీ బస్సు ఎక్కారు. కోడిపిల్లకు కూడా టికెట్ తీసుకోవాలని కండక్టర్ సూచించాడు. బస్సులో కోడిపిల్లకు టికెట్ తీసుకోవాలనే నియమం ఉందని అతడు చెప్పడంతో.. ఆ కుటుంబం దానికి హాఫ్ టికెట్ తీసుకుంది. ఇలా రూ.10తో కొనుగోలు చేసిన కోడి పిల్లను తీసుకెళ్లేందుకు.. ఆ కుటుంబం రూ.50 చెల్లించి టికెట్ తీసుకోవాల్సి వచ్చింది.

Read latest General News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని