Amarvati: గుడివాడ వైకాపా కార్యాలయం వద్ద ఉద్రిక్తత

అమరావతి రైతులు అరసవల్లి వరకు చేపట్టిన పాదయాత్ర గుడివాడలో ప్రవేశించింది. ఈ క్రమంలో

Updated : 24 Sep 2022 18:45 IST

గుడివాడ: అమరావతి రైతులు అరసవల్లి వరకు చేపట్టిన పాదయాత్ర గుడివాడలో ప్రవేశించింది. ఈ క్రమంలో స్థానిక వైకాపా కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పార్టీ కార్యాలయం ఎదుటకు చేరుకున్న పాదయాత్ర వాహనం వద్ద  కళాకారులు పాటలు పాడారు. దీంతో అక్కడి నుంచి వాహనాన్ని తీసివేయాలని పోలీసులు అదేశించారు. ఒక్క పాట పాడి వెళ్లిపోతామని కళాకారులు బదులిచ్చారు. పోలీసులు దురుసుగా ప్రవర్తించి కళాకారులను నెట్టివేశారు. పోలీసుల తీరుకు నిరసనగా కళాకారులు వాహనాన్ని దిగి పాటలు పాడారు. పాదయాత్రను అడ్డుకునేందుకు గుడివాడలో అడుగడుగునా ఆంక్షలు విధించడంపై అమరావతి ఐకాసా నేతలు అసహనం వ్యక్తం చేశారు.

మరోవైపు అమరావతి రైతులకు సంఘీభావం తెలిపేందుకు పెద్ద ఎత్తున ప్రజలు గుడివాడకు తరలివచ్చారు. దీంతో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. కట్టుదిట్టమైన భద్రత నడుమే రైతుల పాదయాత్ర కొనసాగుతోంది.  రైతుల పాదయాత్రకు తెదేపా నేత యరపతినేని శ్రీనివాసరావు సంఘీభావం తెలిపారు. పోలీసు వలయాన్ని ఛేదించుకొని ద్విచక్రవాహనంపై ఆయన గుడివాడ వెళ్లారు. తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కూడా గన్నవరం నుంచి గుడివాడ బయల్దేరి వెళ్లారు. పుట్టగుంట వద్ద ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకొని గన్నవరం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.మా జీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసి కంకిపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

శరత్‌టాకీస్‌ వద్ద ఉద్రిక్తత

గుడివాడ శరత్‌ టాకీస్ సెంటర్‌లోనూ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. టాకీస్‌ వద్దకు రాగానే రైతులు ‘జై అమరావతి’ అంటూ నినాదాలు చేశారు. రైతులకు వ్యతిరేకంగా శరత్‌ టాకీసులో ఉన్న వైకాపా కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో రైతులు, వైకాపా కార్యకర్తలకు పోలీసులు నచ్చజెప్పారు. శరత్‌టాకీస్‌ సెంటర్‌లో రైతులతో కలిసి వచ్చిన  తెదేపా నేత మాగంటి బాబును పోలీసులు నెట్టివేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని